Advertisement
Google Ads BL

నిజంగా సినిమా చూసి ఓటు వేస్తారా?: విజయ్


యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది. పబ్లిక్ మీట్ పేరిట సభలు నిర్వహిస్తూ చిత్రానికి మరింత బూస్ట్ ఇస్తున్నారు. కాగా, సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా పబ్లిక్ మీట్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ముఖ్య అతిధులు. ఈ సినిమాకి జ్ఞానవేల్ రాజా నిర్మాత.  ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్ సి సుందర్ సంగీతం సమకూర్చారు.

Advertisement
CJ Advs

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి పవర్ ఫుల్ సినిమా తీసిన డైరెక్టర్ ఆనంద్ శంకర్ కి ఆల్ ది బెస్ట్.. టెక్నిషియన్స్ కోసం ఈ సినిమా తప్పక హిట్ అవ్వాలి.. రెండు సంవత్సరాల క్రితం విజయ్ నథింగ్ టూ లూస్.. బట్ టుడే విల్ లూస్ నథింగ్.. తనకంటూ ఒక క్లాన్ ప్లాన్ చేసుకున్నాడు. మొదటి సినిమా నుంచి తాను చూపిస్తున్న వేరియేషన్స్ బాగున్నాయి. ఏ హీరోకైనా ఇలాంటి అభిమానం చాలా అరుదు. అది విజయ్‌కి దక్కింది.. విజయ్ ఇన్ బిల్ట్ వెరీ స్ట్రాంగ్. ఇదే కంటిన్యూ చేయి.. మీలాగే నోటా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.. 

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ‘‘విజయ్ నటించిన గీత గోవిందం సినిమా తమిళనాడులో రిలీజ్ చేసాం. మాములు రెస్పాన్స్ రాలేదు. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన సినిమా గీత గోవిందం. ఏ హీరోకి సాధ్యం కాలేదు ఇలాంటి రికార్డులను సాధించడం. ఒక్క విజయ్‌కే అది దక్కింది. మరి నోటాతో ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.. ఇక్కడ ఎలాగైతే విజయ్ కి హార్డ్ కోర్ ఫాన్స్ ఉన్నారో తమిళనాడులో కూడా అలాంటి ఫాన్స్ ఉన్నారు. నోటా కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాని సప్పోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి చాలా థాంక్స్. అక్టోబర్ 5 న కలుద్దాం..’’ అన్నారు. 

హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 5  కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఎంతో ఆసక్తిగా కూడా వెయిట్ చేస్తున్నాను. సినిమా చాలా బాగుంటుంది.. అందరు చూసి ఎంజాయ్ చేయండి.. ఈ సినిమా అందరికి తప్పక నచ్చుతుంది.. ఎక్కడా మీ అందరి అంచనాలను తగ్గించడు. మీ అందరి ఆశీస్సులతో సినిమా తప్పక హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 

ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..  విజయ్ ఇలాంటి పొలిటికల్ సినిమా చేస్తున్నాడంటే ఈ సినిమాలో ఎదో కొత్త పాయింట్ ఉండే ఉంటుంది.. ఒక్కో సినిమాలో ఒక్కోలా క్యారెక్టరైజేషన్స్ మార్చుకునే విజయ్ బయట చాలా హానెస్ట్ గా ఉంటాడు. ఎప్పుడు ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు అందించాలని చూస్తుంటాడు. నోటా సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నాను..’’ అన్నారు. 

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి డిఫెరెంట్ సినిమా తీసినందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి చాలా థాంక్స్. ఇక విజయ్ గురించి చెప్పాలంటే పెళ్లి చూపులు చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలనుకున్నాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఇప్పుడు నోటా ఇవన్నీ చూస్తుంటే మంచి స్క్రిప్ట్ తో విజయ్ దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను.. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్ తో వస్తాను.. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అన్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ’’ఆదివారం ఏపీలో ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది.. రెస్పాన్స్ మాములుగా లేదు.. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది.. ఈ ఈవెంట్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయాస్ మీడియాకి చాలా థాంక్స్..  ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా జరుగుతున్నాయి. అఫిడవిట్లు పెడుతున్నారు. ఎలక్షన్స్ టైం లో  సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీ కి ఫేవర్ గా ఈ సినిమా ఉంటుంది అని అంటున్నారు. అలాంటి ఎలాంటి ఇష్యూస్ ఈ సినిమా లో లేవు.. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది.. అయినా సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు.. వాళ్లకు తెలుసు ఏం చేయాలో.. అక్టోబర్ 5 న మీ అందరికి ఓ కొత్త ఫ్రెష్ సినిమా ఇవ్వబోతున్న.. నోటా ద్వారా కంప్లీట్లీ  సరికొత్త పొలిటికల్ ఎంటర్టైనర్ ని మీకు అందిస్తున్నాం.. ఇంకా టైం లేదు.. కౌంట్ డౌన్ మొదలయ్యింది. 5 న థియేటర్స్ లో కలుద్దాం..నోటా సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా..’’ అన్నారు.

Vijay Deverakonda Sensational Comments on Elections:

Nota Hyderabad Public Meet Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs