Advertisement
Google Ads BL

వరుణ్ తేజ్.. ‘అంతరిక్షం’ నుంచి వచ్చేశాడు


వరుణ్ తేజ్, అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న 'అంతరిక్షం 9000 KMPH' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. ఈ విషయాన్నీ సినిమా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో తెలియజేశారు.. షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోటో ని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అమేజింగ్ గా అనిపించింది అని వెల్లడించారు.. మొదటి సినిమా 'ఘాజి' తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు.. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు..  డిసెంబర్ 21 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుండగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది.. తెలుగులో పూర్తిస్థాయి 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే.

Advertisement
CJ Advs

నటీనటులు: వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు

సాంకేతిక నిపుణులు : దర్శకుడు: సంకల్ప్ రెడ్డి, సమర్పించు వారు : క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు : క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, డీఓపీ : జ్ఞాన శేఖర్ VS, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: ప్రశాంతి విహారీ, ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా, యాక్షన్ కొరియోగ్రాఫర్: టాడార్ పెట్రోవ్ లాజరోవ్, CG : రాజీవ్ రాజశేఖరన్, PRO: వంశీశేఖర్

Antariksham 9000 KMPH shooting Update:

Antariksham 9000 KMPH shoot completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs