చందమామ సినిమాలో క్యూట్ క్యూట్ హీరోయిన్‌గా అందరిని అలరించి.. మగధీర సినిమాలో యువరాణిగా అదరగొట్టి... గ్లామర్ డాల్ గా.. చాలా రోజులు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ కోలీవుడ్‌లో సినిమాలు చేస్తూ.. అవకాశం ఉన్నప్పుడు బాలీవుడ్‌కి వెళ్లొచ్చే కాజల్ ఈమధ్యన ఓ మోస్తరు హీరోలకు కూడా సై అంటుంది. తేజ దర్శకత్వంలో రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా భార్య గా ఆ సినిమాని లీడ్ చేసే కేరెక్టర్ లో ఇరగదీసిన కాజల్.. తాజాగా మళ్ళీ తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కతున్న సినిమాలో నటిస్తుంది. ఇక ఎప్పటిలాగే బెల్లంకొండ సినిమాలో కాజల్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు కాబట్టే ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన నటిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే మరోపక్క తేజతో ఉన్న అనుబంధంతోనే కాజల్ ఇలా శ్రీనివాస్ పక్కన నటిస్తుందనే వారు ఉన్నారు. అయితే కాజల్ తో బెల్లంకొండ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో సినిమా టీజరో, ట్రైలరో వచ్చేవరకు తెలియదు కానీ.. కొన్ని రోజుల నుండి బెల్లంకొండతో కాజల్ ఫ్రెండ్లీగా ఉన్న ఫొటోస్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ మధ్య ఉన్న కెమిస్ట్రీ మీద తెగ క్రేజ్ పెంచుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ లేకపోతే... కాజల్ ఈ సినిమాలో నటిస్తుంది అని అంటున్నారు.
అయితే ఎప్పుడూ గ్లామర్ డాల్ గా, అందమైన చిరునవ్వుతో అందరిని పడేసే కాజల్ అగర్వాల్.. బెల్లకొండ శ్రీనివాస్ - తేజ కాంబోలో వస్తున్న సినిమాలో విలనిజం చూపించబోతుందట. ఈ సినిమాలో ఒక బిజినెస్ వుమెన్ గా కాజల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న బిజినెస్ వుమెన్ గా కాజల్ తన పాత్ర ద్వారా విలనిజాన్ని పండించబోతుందని.. బెల్లంకొండ శ్రీనివాస్ తో నువ్వా నేనా అన్నట్టుగా కాజల్ ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి విలనిజాన్ని పండిస్తూ బెల్లంకొండ తో కాజల్ ఎప్పుడు రొమాంటిక్ ట్రాక్ ఎక్కుతుంది.. ఎపుడు డ్యూయెట్స్ వేసుకుంటుంది అనేది మాత్రం ఆ సినిమా చూసే వరకు సస్పెన్స్ అన్నమాట.