నేటిరోజుల్లో పావలా చికెన్‌కి రూపాయి పావలా మసాలా అనే విషయం కొన్ని సందర్భాలలో నిజం అయింది. ఇక నేడు ప్రమోషన్స్ ముఖ్యమని అందరు ఒప్పుకుంటూ ఉన్నదే. అయితే లేని పోని అంచనాలు పెంచితే అసలుకే మోసమని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ఇక దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మురగదాస్ మహేష్ బాబుని కోలీవుడ్‌కి స్ట్రెయిట్‌గా పరిచయం చేస్తూ, భారీ అంచనాల మద్య తెలుగు, తమిళ భాషల్లో తీసిన ‘స్పైడర్’ చిత్రం మహేష్ అభిమానులనే కాదు.. మురుగదాస్‌ని అభిమానించి, ఆయన పేరు కనిపిస్తే చాలు థియేటర్లకు నమ్మకంగా వెళ్లే వారిని కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం కాన్సెప్ట్‌ని ముందు నుంచి చూచాయగా ఉదాహరణకు రాజమౌళి తరహాలో చేయలేని పబ్లిసిటీ దీనికి ఓ కారణంగా చెప్పాలి.
మహేష్-మురుగదాస్‌ల కాంబినేషన్‌పై కూడా విపరీతమైన హైప్‌ని క్రియేట్ చేశారు. మరోవైపు తన పలు చిత్రాల విషయంలో సినిమాలోలేని స్టిల్స్‌ని, సీన్స్‌ని చూపిస్తూ టీజర్లు విడుదల చేయడం కూడా మురుగదాస్ ‘స్పైడర్’ విషయంలో మైనస్‌గా మారాయి. ఇక విషయానికి వస్తే ఇప్పటికే మురుగదాస్-విజయ్‌ల కాంబినేషన్‌లో ‘తుపాకి, కత్తి’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంగా ‘సర్కార్’ రూపొందుతోంది. గతంలో విజయ్ అనవసర హైప్ క్రియేట్ చేసిన అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘పులి’ డిజాస్టర్‌ని ఇంకా మర్చిపోకడదు. ‘స్పైడర్’ చిత్రం పోస్టర్స్‌తో కూడా మురుగదాస్ మహేష్‌ని ఎంతో హ్యాండ్సమ్‌గా, స్టైలిష్‌గా చూపించి విపరీతమైన అంచనాలు పెంచాడు.
ఇప్పుడు ‘సర్కార్’ విషయంలో కూడా అదే జరుగుతోంది. రఫ్‌గా సిగరెట్ తాగుతు ఉన్న ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో పాటు తాజాగా ఆడియో అక్టోబర్ 2 నుంచి అందుబాటులో ఉంటుందని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎంతో స్టైలిష్‌గా, బూట్లు, కోటుతో ఉన్న విజయ్ లుక్ అభిమానులకు ఐఫీస్ట్‌గానే ఉన్నా, ఫలితం మాత్రం స్పైడర్‌కి భిన్నంగా ఉండాలని ఆశిద్దాం.