దేశంలో జరుగుతున్న నేరాలు, మహిళలపై మానభంగాలు, లైంగికవేధింపుల విషయంలో ఇప్పటికే 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న మైనర్లే ఎక్కువగా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నిర్భయ కేసులో అందరి కంటే అత్యంత క్రూరంగా ప్రవర్తించింది కూడా ఓ మైనరే. కానీ మైనర్ల ముసుగులో వీరు తక్కువ పాటి శిక్షతో తప్పించుకుంటున్నారు. దాంతో ఇది సమాజంపై, ఇతర మైనర్ పిల్లల మనస్సులో కూడా పలు విషభీజాలను నాటుతోంది. దీనికి తాజాగా మరో ఉదాహరణ నిలిచింది.
కంగనారౌనత్‌తో పాటు సంజయ్‌దత్ వంటి వారికి హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేసే వ్యక్తి బ్రాండన్. ఈయన దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి. ఈ మనిషి స్వలింగ సంపర్కుడు. ఈయనకు మరో 16ఏళ్ల బాలుడు తోడయ్యాడు. ఈ బాలుడు తాను 16ఏళ్ల మైనర్‌ని ఆయినప్పటికీ ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా తనకి తాను పలువురు పురుషులను పరిచయం చేసుకున్నాడు. తనని తాను మోసపూరితంగా మేజర్‌ని అని 18ఏళ్లని తెలిపాడు. కాగా ఈ కుర్రాడు విపరీతమైన మానసిక ప్రవర్తన కలిగిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇతను బ్రాండన్తో కలిసి శృంగారంలో పాల్గొంటూ ఉండగా, ఆ మైనర్ బాలుని తల్లి ప్రత్యక్షంగా చూసింది. అంతేకాదు.. ఈ బాలుడిని బ్రాండన్‌తో పాటు మరో ఎనిమిది మంది పురుషులతో కూడా లైంగిక సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. కాగా నిందితుడైన బ్రాండన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో ప్రస్తుతం కంగనారౌనత్ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈనేపధ్యంలో బ్రెండన్ కూడా అక్కడే ఉన్నాడు. షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన పోలీసులు బ్రాండన్‌ని అరెస్ట్ చేశారు. ఈయనపై ప్రోకో చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 3న ఈయన కోర్టుకి హాజరుకావాల్సివుంది.
ఇందులో తప్పు కేవలం బ్రాండన్‌దే అని చెప్పడం కంటే ఆ 16ఏళ్ల బాలుడిది కూడా తీవ్రమైననేరమేనని చెప్పాలి. కోర్టులు సమానత్వం పేరుతో స్వలింగ సంపర్కం తప్పు కాదని చెప్పడం, అదేమంటే లైంగిక స్వేచ్చని అడ్డుకోవడం రాజ్యాంగం పరంగా తప్పని చెప్పడం, వివాహేతర సంబంధాలు కూడా రాజ్యాంగ సమ్మతమేనని తీర్పులు ఇవ్వడం చూస్తుంటే మన దేశంలో న్యాయస్థానాలు ఇతర దేశాల వలే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉండటం లేదని చెప్పాలి.