Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ ఈజ్..??


క్రికెట్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు ప్రేక్షకులు, అభిమానులు రసవత్తరమైన ఆ మ్యాచ్ చూడడానికి బుల్లితెరకు ఎలా అతుక్కుపోతారో.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికా వంటి దేశంలోనూ బిగ్ బాస్ సీజన్ టు విన్నర్ గురించి వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అప్పుడే 113 రోజులు కంప్లీట్ చేసుకుందా.. బిగ్ బాస్ అన్నట్టుగా అందరి ఇళ్లల్లో రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు బిగ్ బాస్ వీక్షిస్తూ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసేవి. ఇక చిన్న పిల్లలయితే.. ఓహో అప్పుడే బిగ్ బాస్ అయ్యిపోయిందా... రేపటి నుండి మేము ఏ షో చూడాలంటూ డల్ గా అయ్యారంటే... ఈ బిగ్ బాస్ సీజన్ టు ప్రేక్షకుల్లోకి ఎంతగా వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక శని, ఆదివారాల్లో నాని హోస్టింగ్ తో.. మిగతా రోజులు అంటే వీక్ డేస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో గత 113 రోజులుగా రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ సీజన్ టు ఎట్టకేలకు ఫైనల్ పోరుకి వచ్చేసింది. ఈ ఆదివారం నాని హోస్టింగ్ తో టాప్ లో ఉన్న ఐదుగురిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ముందు నుండి బిగ్ బాస్ సీజన్ టు కి గెస్ట్ గా వెంకీ వస్తున్నారని చెప్పినట్టుగానే.. చివరికి ఫైనల్ రేసులో ఉన్న కౌషల్, గీత మాధురిలో ఒకరిని విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ టు విన్నర్ ని ప్రకటించడం జరిగింది. 

Advertisement
CJ Advs

ఇకపోతే టాప్ ఫైవ్ నుండి మొదటగా సామ్రాట్ బయటికి రాగా.. ఆ తర్వాత దీప్తి నల్లమోతు, మూడో ఎలిమినేటర్ గా తనీష్ వరసగా బయటికొచ్చేశారు. ఈ ఫైనల్ పోరు మధ్య మధ్యలో బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తేజు, శ్యామల, దీప్తి సునయన, నందిని వంటి వారు బిగ్ బాస్ స్టేజ్ మీద పెరఫార్మెన్సెస్ తో అల్లాడించారు. ఒక్కో సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ తో ఉర్రుతలూగించారు. ఇక మిగిలిన టాప్ టు కౌశల్, గీత మాధురి నుండి విక్టరీ వెంకటేష్ ఫైనల్ విన్నర్ ని నానితో కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేస్తూ.. ప్రకటించారు. అందరూ అనుకున్నట్టుగానే  కౌశల్ బిగ్ బాస్ సీజన్ టు టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. కౌశల్ హీరో అఫ్ ద బిగ్ బాస్ కాగా..  గీత మాధురి రన్నరప్ గా నిలిచింది. మరి కౌశల్ ఆర్మీ చెప్పినట్టుగానే కౌశల్ విన్నర్ అయ్యాడు. కౌషల్ ఆ ప్రౌడ్ మూమెంట్ ని బిగ్ బాస్ స్టేజ్ మీద బాగా ఎంజాయ్ చేశాడు. 

ఇక బిగ్ బాస్ విన్నర్ అవడానికి అతని కాన్ఫిడెన్స్, అతని ఫిజికల్ పవర్, అన్ని అంటే అన్ని కౌశల్ని బిగ్ బాస్ సీజన్ టు  విన్నర్ ని చేశాయి. ఇక తాను గెలుచుకున్న  ప్రైజ్ మనీని తన తల్లి క్యాన్సర్ తో చనిపోవడంతో.. మిగతా తల్లులెవరూ అలాంటి పరిస్థితిలో చనిపోకూడదని..  తన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషేంట్స్ కోసం ఇస్తున్నట్లుగా  బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రకటించాడు కౌశల్.

Bigg Boss Telugu Season 2 Winner is..:

Kaushal is the Bigg Boss Telugu Season 2 Winner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs