Advertisement
Google Ads BL

చరణ్.. భలే తప్పించుకున్నాడు..!!


గత రెండు రోజులుగా రామ్ చరణ్ ఒక మంచి సినిమాని మిస్ అయ్యాడు... అందులో రామ్ చరణ్ నటిస్తే ... హిట్ సినిమాలో రామ్ చరణ్ భాగమయ్యేవాడు అంటూ రకరకాల వార్తలు సోషల్, వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటనుకుంటున్నారా.. మణిరత్నం నవాబ్. తమిళంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నవాబ్ (తెలుగు టైటిల్) సినిమా గత గురువారం తెలుగు, తమిళంతో పాటుగా... ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో కూడా పర్వాలేదనిపించింది. ఇక నవాబ్ క్రేజ్ ఓవరీసీస్ లోను బాగుందట.

Advertisement
CJ Advs

అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి ని కలిపి మల్టీస్టారర్ గా మణిరత్నం ఈ నవాబ్ సినిమాని తెరకెక్కించాడు. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు అనే కాన్సెప్ట్ తో మణిరత్నం ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యడం.. తమిళ తంబీలకు ఈ సినిమా బాగా నచ్చడం జరిగిపోయాయి. అయితే ఆ సినిమాలో వన్ అఫ్ ద హీరోగా చరణ్ చెయ్యాల్సిందంటున్నారు. ధృవ సినిమా ముందు అంటే ఓకె బంగారం హిట్ అయినప్పటి నుండే మణిరత్నం డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా ఉంటుందనే టాక్... అలాగే మణికి, చరణ్ కి మధ్యన చర్చలు జరగడం... మణిరత్నం చెప్పిన కథ చరణ్ కి నచ్చక ఆయనతో సినిమా చెయ్యడం అనేదాన్ని పక్కన పడేశాడు చరణ్. ఇక చరణ్ రిజెక్ట్ చేసిన స్టోరీతోనే మణిరత్నం నవాబ్ ని తెరకెక్కించినట్లుగా... నవాబ్ లో శింబు క్యారెక్టర్ ని చరణ్ చేయాల్సింది అంటూ నిన్నటి నుండి సోషల్ ఇండియాలో ఒకటే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

మరి నవాబ్ సినిమా హిట్ అయినా అందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతితో పాటుగా శింబు కూడా నటించాడు. కానీ శింబుది ఈ సినిమాలో కీలక అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఏమి కాదు. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. మరి గుంపులో గోవిందం అనే క్యారెక్టర్ లోనే శింబు నటించాడు. ఎలా అంటే అసలు ఈ సినిమాలో శింబు చేసినది హీరో పాత్ర కాదు అన్నది కరెక్ట్. మరలాంటి పాత్రని చరణ్ రిజెక్ట్ చేసి మంచి పనే చేశాడు కానీ.... తొందర మాత్రం పడలేదు. మరి నవాబ్ సినిమాకి అంత స్టార్ కాస్ట్ ఉంది... అలాగే కథలో మల్టీస్టారర్ బలం ఉంది కాబట్టి... సినిమా హిట్ అయ్యింది. కానీ చరణ్ ఆ సినిమాని రిజెక్ట్ చేసి తప్పు మాత్రం చెయ్యలేదు... అనేది మాత్రం వాస్తవం. 

Ram Charan Rejected Nawab :

Ram Charan Safe From Maniratnam Nawab
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs