Advertisement
Google Ads BL

సెన్సేషనల్‌ స్టార్‌పై ఐటిదాడులు..!


కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొందరినీ టార్గెట్‌ చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వేధింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే తమిళనాడులోని శశికళ అనుయాయులు, కమల్‌హాసన్‌ వంటి వారిని టార్గెట్‌ చేశారు. మరోవైపు తెలంగాణలో జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డిలపై ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. మరోవైపు చంద్రబాబుని బాబ్లీ ఉద్యమ నేపధ్యంలో 8ఏళ్ల తర్వాత మరలా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. త్వరలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడుని కూడా సోదాలు, అరెస్ట్‌ చేయడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇలాంటి ఐటి దాడులు, ఈడీ దాడులను కూడా మనం ఖండించాల్సిన అవసరం లేదు. కానీ అందులో పొలిటికల్‌, కక్ష్యసాధింపు కోణం ఉంటే వాటిని ఖండించాల్సి వస్తోంది. నేడు ఓ రవాణాశాఖ, రిజిస్ట్రేషన్‌ శాఖలతో పాటు పలు చిన్నస్థాయి ఉద్యోగుల వద్దే కోట్లలో రాబడికి మించిన ఆస్తులు కనిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఒక్కో ఎమ్మెల్యే రేపు ఎన్నికల్లో 50కోట్లు, ఎంపీలు 100కోట్లపైగా ఖర్చుపెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో లక్షల్లో మాత్రమే పట్టుబడిన వారిపై ఇలాంటి దాడులు అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే వీటిని కక్ష్యసాధింపు చర్యలు గా కాకుండా అవినీతిపై పోరాటం చేస్తున్నామనే భ్రమను ప్రజల్లోకి పంపేందుకు మరికొందరిపై కూడా దాడులు చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే తాజాగా విడుదలైన మణిరత్నం చిత్రం 'నవాబ్‌' తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా తమిళంలో బాగానే ఆడుతోంది. మణి మ్యాజిక్‌ మిస్‌ అయిన ఈ చిత్రంలో సెన్సేషనల్‌ హీరో విజయ్‌ సేతుపతి కూడా నటించాడు. ఇక ఈయన ప్రస్తుతం చిరంజీవి 'సై..రా', త్రిషతో '96', 'సీతకత్తి, సూపర్‌డీలక్స్‌' చిత్రాలలో నటిస్తున్నాడు. త్రిషతో ఆయన నటించిన '96' చిత్రం అక్టోబర్‌ 4న విడుదల కానుంది. 

అలాగే విజయ్‌సేతుపతి రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న 'పెటా' చిత్రంలో ప్రతినాయకునిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఆయన ఔట్‌డోర్‌కి వెళ్లిన నేపధ్యంలో ఆయన ఆఫీసర్‌, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. ఈ విషయాన్ని విజయ్‌ ఆఫీసు సిబ్బంది ధృవీకరించలేదు అలాగని నిజం కాదని ఖండించను లేదు. ఈ దాడులు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. కొందరు మాత్రం ఇవి మామూలు దాడులేనని అంటున్నారు. 

Income Tax raids on Vijay Sethupathi's house:

Sudden IT raid at Vijay Sethupathi's house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs