Advertisement
Google Ads BL

‘అరవింద సమేత’ కోసం అల్లుఅర్జున్ వెయిటింగ్!


‘అరవింద సమేత’ చిత్రం రిజల్ట్ కోసం అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ డైరెక్టర్ తో ఇంకా తన నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ చేయలేదు. విక్రమ్ కె. కుమార్ తో చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నా ఇంకా ఆఫీషియల్‌గా కన్ఫర్మేషన్ రాలేదు. అయితే త్రివిక్రమ్ కూడా ‘అరవింద సమేత’ తర్వాత ఏ హీరోతో చేస్తాడో క్లారిటీ ఇవ్వలేదు. కానీ వెంకటేష్ కి ఓ లైన్ చెప్పినట్టు అది ఓకే అయినట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement
CJ Advs

త్వరలోనే వెంకటేష్ తో సినిమా అనౌన్స్‌ అవుతుందని టాక్‌ వుంది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈ ఇద్దరినీ పెట్టి మల్టీస్టారర్‌ తీసే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. ఎందుకంటే వెంకటేష్ కి చెప్పింది మల్టీస్టారర్‌ లైన్ అని తెలుస్తుంది. అది చేయడానికి వెంకీ సమ్మతం తెలిపాడు కూడా. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇంకా ఓకే చెప్పలేదని టాక్. ఒకవేళ ఓకే అంటే ఈ ఇద్దరితోనే ఆ సినిమా లాంఛ్‌ అవుతుంది.

అందుకోసమే అల్లు అర్జున్ ‘అరవింద సమేత’ ఫలితం గురించి వెయిట్ చేస్తున్నాడు. మరోపక్క ‘అరవింద సమేత’ రిజల్ట్ త్రివిక్రమ్ కి కూడా కీలకం కానుంది. ఎందుకంటే ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌ తో ఆయన ఎన్ని విమర్శలకు గురైనాడో తెలిసిన విషయమే. చాలా కసిగా అరవింద సమేత చిత్రంను త్రివిక్రమ్ రూపొందించాడు. ఏ మాత్రం టాక్ తేడాగా వచ్చినా నెక్స్ట్ సినిమా విషయంలో గ్యాప్ తీసుకోవచ్చు. సో అటు అల్లు అర్జున్ కి.. ఇటు త్రివిక్రమ్‌కి ‘అరవింద సమేత’ ఫలితం కీలకం కానుంది.

Allu Arjun waiting for Aravinda Sametha Result:

Allu Arjun and Venkatesh Combo movie in Trivikram Srinivas Direction 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs