Advertisement

‘నవాబ్’లో ఉన్న మ్యాటరేంటి..?


మణిరత్నం గురించి మాట్లాడాల్సివస్తే తన సినిమా గురించి మాట్లాడాలి. ఎందుకంటే అతను తీసిన సినిమాలు అటువంటివి. ఒకప్పుడు తను తీసిన సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ టైమ్‌లో చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి ఈయనే రోల్ మోడల్. అటువంటి ఆయనకు ఆ తర్వాత అస్సలు టైం కలిసిరాలేదు. తీసిన ప్రతీ సినిమా డిజాస్టర్ అయింది. అయినా సరే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలతో వచ్చేవారు.

Advertisement

మొన్నే ప్రేక్షకుల ముందు ‘నవాబ్’ అనే సినిమాతో ముందుకు వచ్చాడు. ప్రకాష్ రాజ్, జయసుధ, శింబు, అరవింద స్వామి, జ్యోతిక, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ వంటి భారీ తారాగణంతో ఈసినిమాను తెరకెక్కించాడు. రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందించాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ స్తానం కోసం ముగ్గురు అన్నతమ్ములు మధ్య ఎదురైన సంఘటనలు ఏమిటి అనేది సినిమా కథ. తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్.. తల్లి పాత్రలో జయసుధ నటించారు. వీరికి కొడుకులుగా అరవింద స్వామి, శింబు, అరుణ్ విజయ్ నటించారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఒక మాఫియా చక్రవర్తి. చాలామంది.. ప్రకాష్ రాజ్ అంటే గిట్టని వాళ్లు ఉన్నారు. అయితే ఒకరోజు ప్రకాష్ రాజ్, జయసుధలు పై హత్యా ప్రయత్నం జరుగుతుంది. అందులో నుండి ప్రకాష్ రాజ్, జయసుధలు గాయాలతో బయట పడతారు. ఆ ప్రయత్నం ఎవరు చేసారు అన్న దాని మీద ఆరా తీసే క్రమంలో ప్రకాష్ రాజ్ గుండె పోటుతో మరణిస్తాడు. దీంతో తన తండ్రి స్థానం కోసం ఈ ముగ్గురి అన్నతమ్ముల మధ్య సంఘర్షణలు, ఒకరి మీద ఒకరి అనుమానాలు వ్యక్తం అవుతాయి. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కొన్ని కారణాలు వల్ల కొన్ని నెలలు పాటు సస్పెండ్ అవుతాడు. మరి విజయ్ వీరి ఫ్యామిలీలోకి ఎలా ఎంటర్ అయ్యాడో, అసలు విజయ్ ఆ అన్నతమ్ములకి ఏవిధంగా సాయపడ్డాడో అనేది సారాంశం.

ఎప్పటిలానే మణిరత్నం తనదైన శైలితో స్క్రీన్‌ప్లే ను నడిపించాడు. మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా బాగా తీశాడు. రెహమాన్ సంగీతం సినిమాకి హైలైట్. ఈసినిమాలో ప్రతీ ఒక్క నటుడు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. విజయ్ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో విజయ్ పెర్ఫార్మన్స్ కు థియేటర్స్ లో చప్పట్లు పడ్డాయి. ఫస్ట్ హాఫ్‌లో పాత్రలను ఇంట్రడ్యూస్ చేయడం.. విజయ్ తో వచ్చే కామెడీ సన్నివేశాలతో, కొన్ని ఎమోషనల్ సీన్లతో బాగా తీశారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడక్కడా స్లో అవ్వడం.. ఏదో మిస్ అయిందని ఫీలింగ్ రావడంతో సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. క్లైమాక్స్ సీన్ తప్ప.. ఓవరాల్ గా ఈసినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అయితే నచ్చకపోవచ్చు కానీ మణిరత్నం ఫ్యాన్స్ కి అయితే కచ్చితంగా నచ్చుతుంది.

Nawab Movie Brief Story:

What in ManiRatnam Nawab Movie?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement