Advertisement
Google Ads BL

అల్లు శిరీష్‌ మా.. గొప్ప పని సేసేశాడుగా..?


మన హీరోలు దేనికి స్పందించినా స్పందించకపోయినా అభిమానులకు బాధ వస్తే మాత్రం స్పందిస్తారు. ఎందుకంటే వారికి అభిమానులే దేవుళ్లు. ఇక ఇటీవల అల్లుఅరవింద్‌ కూడా ‘గీతాగోవిందం’ లాభాలలో 10 కోట్లు దర్శకుడు పరుశురాంకి ఇవ్వాలని ఉదార నిర్ణయం తీసుకున్నాడు. ఇక విషయానికి వస్తే బన్నీకి తన సోదరుడు అల్లు శిరీష్‌ అంటే ఎంతో ఇష్టం. తన సోదరుడిని కూడా హీరోగా నిలబెట్టాలని ఆయనతో పాటు ఆయన తండ్రి కూడా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. కానీ బ్యాడ్‌లక్‌.. ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టార్ స్టేటస్ మాత్రం శిరీష్‌కి రావడం లేదు.

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే బన్నీ తాజాగా అల్లుశిరీష్‌కి ఓ బహుమతి ఇచ్చాడు. యాపిల్‌ మాక్‌ ల్యాప్‌టాప్‌ని శిరీష్‌కి గిఫ్ట్‌గా ఇవ్వడంతో దీనిపై శిరీష్‌ స్పందిస్తూ, నా పట్ల బన్నీకి ఉన్న ప్రేమకు పొంగిపోతున్నాను. చిన్నప్పటి నుంచి అన్నయ్య నాకు ఎన్నో గిఫ్ట్‌లు ఇచ్చాడు. అలా యాపిల్‌ మాక్‌ ల్యాప్‌టాప్‌ని ఇచ్చిన అన్నయ్యకి ధన్యవాదాలు అని స్పందించాడు. అయితే అల్లుశిరీష్‌కి ఓ అభిమాని సెంటిమెంట్‌తో కూడిన ఫిట్టింగ్‌ పెట్టాడు. ‘అన్నా.. నాకు చిన్న ల్యాప్‌ట్యాప్‌ ఇవ్వవచ్చు కదా....! నేను కొనాలంటే మూడేళ్లు పడుతుంది. నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ. జీతం తక్కువ. నాకు ల్యాప్‌ట్యాప్‌ చాలా అవసరం. కానీ ఇంత వరకు కొనుక్కోలేకపోయాను’ అని తెలిపాడు. 

అందుకు వెంటనే స్పందించిన అల్లుశిరీష్‌.. ‘నువ్వేం బాధపడకు తమ్ముడు.. నాకు కొత్త ల్యాప్‌ట్యాప్‌ వచ్చింది కనుక నా దగ్గర ఉన్న సోనీ ల్యాప్‌ట్యాప్‌ నీకు ఇస్తాను. నీ వివరాలు పూర్తిగా నాకు మెయిల్‌ చెయ్’ అని సమాధానం ఇచ్చాడు. నిజంగా ఈ విషయంలో అల్లుశిరీష్‌ పెద్దమనసును మెచ్చుకోవాల్సిందే.

Allu sirish presents laptop as gift to his fan:

Mega hero Allu Sirish gives away laptop to needy fan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs