Advertisement
Google Ads BL

రష్మిక(పూజ) ని సరిగా వాడలేదు కదా..!


ప్రస్తుతం టాలీవుడ్లో కన్నడ భామ రష్మిక మందన్న జోరు మాములుగా లేదు. ఛలో సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు సినిమాల హిట్స్ తో ఉన్న రష్మికకి నిన్న విడుదలైన దేవదాస్ కూడా హిట్ టాక్ రావడంతో అమ్మడు మాత్రం ఫుల్ హ్యాపీలో ఉంది. ఎందుకంటే మూడు హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టేసింది. రష్మిక మందన్న - నాని, నాగార్జున - ఆకాంక్ష సింగ్ ల కలయికలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్ కి ఫస్ట్ షోకే మిక్స్డ్ టాక్ రావడం. క్రిటిక్స్ నుండి కూడా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.... సాయంత్రానికల్లా.. సినిమాకి హిట్ టాక్ వచ్చింది. గీత గోవిందం సినిమా తర్వాత మళ్ళీ అలాంటి కామెడీ మూవీ ఏది థియేటర్స్ లో లేకపోవడంతో బోర్ కొట్టిన ప్రేక్షకులు దేవదాస్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నట్టుగా టాక్.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాలో నటించిన నాగార్జున - నాని కాంబో అదరగొట్టేసింది.. కానీ.. ఇద్దరు  స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కాబట్టి హీరోయిన్స్ ప్రాధాన్యత వద్దనుకున్నాడో ఏమో కానీ శ్రీరామ్ ఆదిత్య రష్మికాని, ఆకాంక్షని  బలవంతంగా ఇరికించినట్టే అనిపిస్తుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన ర‌ష్మిక‌, ఆకాంక్ష‌.. ఇద్ద‌రివీ అతిథి పాత్ర‌లే అన్నట్టుగా ఉండడం.... గీత గోవిందం త‌ర‌వాత ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర‌లో రష్మిక నటించింది. ఇక పోలీస్‌ గెటప్‌లో రష్మిక మరింత కామెడీగా కనిపిస్తుంది అని అంటున్నారు. పైగా రష్మిక మందన్న స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా మొక్కుబడిగా ఉండటం నిరాశ కలిగిస్తుంది. కానీ గ్లామర్ పరంగా రష్మిక ఆకట్టుకుందంటున్నారు ప్రేక్షకులు. ఎలాగూ గీత గోవిందం మేనియాలో ఉన్నాం కాబట్టి రష్మికనే లుక్స్ లో గెలుస్తుంది. కాకపోతే దర్శకుడు నాని – రష్మికల లవ్ ట్రాక్ ఫై ఇంకొంచెం దృష్టి పెడితే బాగుండేది అని అంటున్నారు.

మరి రష్మిక హ్యాట్రిక్ కొట్టింది కానీ...తనకి మంచి పేరు తెచ్చుకోలేకపోయింది. ఛలో సినిమాలో నాగ శౌర్య తో పోటీ పడి నటించిన రష్మిక.. గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో నటనలో, లుక్స్ తో పోటీపడి పేరు తెచ్చుకుంది. గీతగా గీర ఎక్కువ ఉన్న అమ్మాయిగా రష్మిక గీత గోవిందంలో అదరగొట్టింది. సింపుల్ లుక్స్ తో, ఆకట్టుకునే అందంతో, మంచి నటనతో మెప్పించింది. దర్శకుడు పరశురామ్ రష్మిక క్యారెక్టర్ ని బాగా హైలెట్ చెయ్యడంతో ఆ సినిమాలో రష్మిక నటనతో మెప్పించింది. కానీ దేవదాస్ లో నటనకు ఆస్కారం లేకుండా లుక్స్ తోనూ, అందంతోను ఎంత సేపు మేనేజ్ చేసినా సరిపోదు కదా. అందుకే రష్మిక పూజ క్యారెక్టర్ కి దేవదాస్ లో పెద్దగా చోటు దక్కలేదు.

No importance to Rashmika role in Devadas:

Rashmika gots Hattrick but.. NO Importance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs