త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ల తొలిసారి కాంబినేషన్ జోరు చూస్తుంటే పాత రికార్డులను తిరగరాసేటట్లే అనిపిస్తోంది. ఈ చిత్రం కౌంట్‌డౌన్‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ఖరారు చేసింది. ఎలాంటి ట్విస్ట్‌లు ఇవ్వకుండా ముందునుంచి అందరు ఊహిస్తున్నట్లుగా, యూనిట్ చెబుతున్నట్లే అక్టోబర్ 11న విజయ దశమి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్స్‌ని రిలీజ్ చేసి ఖరారు చేసింది. దీంతో దసరా పండుగలను ముందుగానే అక్టోబర్ 11నే చేసుకోవడానికి యంగ్‌టైగర్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. టీజర్‌లోనూ, పాటల్లోనూ, సిక్స్‌ప్యాక్ లుక్‌తో ఎన్టీఆర్‌పై విడుదల చేసిన ఫస్ట్‌లుక్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఎమోషన్స్ మిక్స్ చేస్తూ వచ్చిన యూనిట్ రిలీజ్ డేట్ పోస్టర్స్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా స్టైల్‌ని మార్చేసింది.
ఈ పోస్టర్స్‌ని చూస్తుంటే వీటిని యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే విధంగా పక్కా క్లాస్‌లుక్స్‌తో డిజైన్ చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో హ్యాండ్సమ్‌గా, గతంలో ఎన్నడు కనిపించని క్లాస్‌లుక్‌తో చాలా కూల్ అండ్ ఫన్నీగా వీటిని రూపొందించడం త్రివిక్రమ్ పబ్లిసిటీలోని మరో కోణమని స్పష్టంగా అర్దమవుతోంది. దీని ద్వారా ఇది ఫుల్ మీల్స్ వంటి అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమని అర్దమవుతోంది. ఎన్టీఆర్‌లోని అన్ని వేరియేషన్స్‌ని త్రివిక్రమ్ ఫుల్‌గా వాడేసుకున్నట్లు స్పష్టంగా అర్దమవుతోంది. ఈ పోస్టర్స్‌తో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తోన్న తమ అభిమాన హీరోని చూసి యంగ్‌టైగర్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో పూజాహెగ్డే, ఈషారెబ్బాలను కూడా త్రివిక్రమ్ తన స్టైల్‌లో ఎంతో అందంగా, గ్లామరస్‌గా చూపించబోతున్నాడు.
ఇక ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్‌లో 'పెనిమిటి' అనే పాట మాత్రమే సౌండ్ పరంగా బాగుందని కొందరు వ్యాఖ్యానించడం సరికాదు. పాట అంటే మాట అంతమయ్యే చోట మాటల్లో చెప్పలేనిది చెప్పడానికి వాడే బలమైన ఆయుధమని ఈ పాటలను వింటే అర్దమవుతోంది. ఏది ఏమైనా వీటి చిత్రీకరణలో కూడా త్రివిక్రమ్ తన స్టైల్‌ని చూపిస్తాడని ఖచ్చితంగా నమ్మవచ్చు. మరి అందరి చూపు ఇప్పుడు అక్టోబర్ 11 మీదే నిలిచి ఉంది. ఇక దీని ప్రీరిలీజ్ వేడుక ఉంటుందా? ఎన్టీఆర్ ఆ మూడ్‌లో ఉన్నాడా? లేదా? అనే విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అది కూడా వస్తే అభిమానుల జోష్ మరింతగా పెరగడం ఖాయమనే చెప్పాలి.