Advertisement
Google Ads BL

నాగ్ వీకీపీడియాని అనుమానిస్తున్న యంగ్‌ హీరో!


షష్టిపూర్తి వయసులో కూడా యంగ్‌ స్టార్స్‌కి చాలెంజ్‌ విసరడంలో నాగార్జున ముందుంటాడు. ఆయన జీవన విధానం, పాటించే క్రమశిక్షణ నుంచి తన తిండిని కూడా తానే తయారు చేసుకునేంత హెల్త్‌ కాన్షియన్స్‌ తనకి ఉందని గతంలో నాగార్జున ఓ సారి తన హెల్త్‌ సీక్రెట్‌ చెప్పాడు. అందుకే ఆయన ఇంకా నేను యువ సమ్రాట్‌ని కాదు అన్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఆయనలో ఇప్పటికీ నవ మన్మథుడు ఉన్నాడంటారు. బాడీ ఫిట్‌నెస్‌ని మెయిన్‌ టెయిన్‌ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా..? అందుకే 'సంతోషం' శతదినోత్సవ వేడుకల్లో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ బహిరంగంగా 'నీ గ్లామర్‌ సీక్రెట్‌ చెప్పు బాబాయ్‌' అని అడిగాడు. ఇలా అడిగిన వారి గురించి లెక్కేలేదు. ఇక నాగార్జున తాను నటించిన 'ఢమరుకం' చిత్రంలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. 

Advertisement
CJ Advs

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగిలిన హీరోల వలే సిక్స్‌ప్యాక్‌ కోసం అంటూ నాగార్జున ప్రత్యేకంగా చేసిన కసరత్తులు ఏమిలేవు. తన బాడీ సహజ సిద్దంగానే అలా ఉంటుందని నాటి ప్రమోషన్స్‌లో ఆయనే చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా నాగార్జున, నానిలు కలిసి నటించిన మల్టీస్టారర్‌ 'దేవదాస్‌' రిలీజ్‌ అయింది. ఇందులో యంగ్‌ నేచురల్‌ స్టార్‌ నానికి పోటీగా అంతే ఉత్సాహంతో, అంతే ఫిట్‌నెస్‌తో నాగ్‌ కనిపించడం మిగిలిని వారికి ఆశ్చర్యం కలిగిస్తుందేమో గానీ ఆయనను ఎరిగిన వారికి మాత్రం అది పెద్దగా ఆశ్చర్యకరం కాదు. ఇక తాజాగా నాగ్‌పై 'ఆర్‌ఎక్స్‌ 100'తో సూపర్‌హిట్‌ కొట్టిన హీరో కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

'వీకీపీడియో ఏమైనా తప్పు చూపుస్తోందా? ఈ మనిషి వయసు 59 అని చెబుతోంది. నాగార్జున సార్‌.. మీకు నమస్కారం. మీరు ఫిట్‌నెస్‌ విషయంలో 20ఏళ్ల హీరోలకు కూడా సవాల్‌ విసురుతున్నారు. ఏమున్నాడ్రా బాబూ' అంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ పెట్డాడు. ఈ సందర్భంగా తాజాగా విడుదలైన 'దేవదాస్‌'లోని నాగార్జున స్టిల్‌ని ఆయన పోస్ట్‌ చేశాడు. ఈ స్టిల్‌ చూస్తుంటే కార్తికేయ చెప్పింది 100శాతం నిజమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్న నాగ్‌ యంగ్‌ హీరోలకు నిజమైన చాలెంజ్‌ని విసురుతున్నాడనేది వాస్తవం. కాస్త నాని చెప్పినట్లు నాగార్జునలోని చెడు లక్షణాలను మనం కూడా ఫాలో అయితే అలాగే కనిపిస్తామో లేదో నాగ్‌నే సీక్రెట్‌గా అడిగేయాలి సుమా...! 

Hero Karthikeya Tweet About Nagarjuna Fitness:

RX 100 Hero Karthikeya Tweet on Nagarjuna Devadas Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs