యూ టర్న్ సినిమా హిట్ అయ్యింది.. సమంత ఖుష్ అయ్యింది. అసలే ఈ ఏడాది నాలుగు హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. కానీ భర్త నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడుకి యావరేజ్ టాక్ అండ్ రివ్యూస్ రావడం మాత్రం సమంత తట్టుకోలేకపోయింది. అయితే శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో బిజీ బిజీ గా గడిపిన చైతు, యూటర్న్ సినిమా షూటింగ్, ప్రమోషన్స్ తో బాగా బిజీ అయిన సమంతలు తమ పెళ్లి రోజు వేడుకల కోసం విదేశాలకు ఈ క్యూట్ కపుల్ ట్రిప్ కి వెళ్లిపోయారు. అక్టోబర్ 6 న పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ ని పది రోజుల ముందే మొదలు పెట్టిన ఈ యువ జంట ఐబిజా అనే ఐలాండ్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నాగ చైతన్యతో పాటుగా.. అఖిల్ అక్కినేని, సమంత ఫ్రెండ్ నీరజ కోన, నాగ్ ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్ప రెడ్డి, ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో చైతు, సామ్ లు పబ్ లు, పార్టీలు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ వెకేషన్స్ లో గ్లామర్ అండ్ హాట్ భామ అయిన సమంత టు పీస్ బికినీ ఫొటోస్ తో పాటుగా.. హాట్ హాట్ ఫొటోస్, అలాగే భర్త చైతుతో కలిసి ఉన్న హాటెస్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇక సమంత షేర్ చేస్తున్న హాట్ ఫొటోస్ ని కొంతమంది లైట్ తీసుకోగా.. కొంతమంది మాత్రం అక్కినేని ఇంటి కోడలుగా అక్కినేని ఇంటి పరువు పోగొట్టడానికే సమంత ఇలా హాటెస్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుందని.. పెళ్లయ్యాక ఇంతలా బరితెగించడం అనేది కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలెట్టేశారు. గ్లామర్ లైఫ్ మాత్రమే కావాలనుకుంటే పెళ్ళెందుకు చేసుకోవాలి..? నీకు డబ్బు, పేరు మాత్రమే కావాలి. ఒక పద్ధతైన భార్యగా ఉండడానికి నీకు అర్హత లేదు అంటూ ఓవర్ చేస్తున్నారు. మరి గతంలో పెళ్లయిన కొత్తలో బికినీ ఫోజున్న డ్రెస్సులో ఫొటోస్ షేర్ చేసినప్పుడు సమంతని కొంతమంది నెటిజెన్లు ఆడుకున్నప్పటికీ.. సమంత వాళ్ళకి ఘాటైన రిప్లై ఇచ్చింది. మరి తాజాగా తనని, తన డ్రెస్సుని విమర్శిస్తున్నవారికి సమంత మాములుగా రిప్లై ఇవ్వలేదు.
ఎంతగా సమంత హర్ట్ అవ్వకపోతే.. ఇలాంటి రిప్లై ఇస్తుంది. తనని ట్రోల్ చేస్తున్న అభిమానులకు ఒక పక్క థాంక్స్ అని చెబుతూనే కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. సమంత మిడిల్ ఫింగర్‌ని పోస్ట్ చేస్తూ.. నా వైవాహిక జీవితం నా ఇష్టం.. దాని గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది అంటూ తనని ట్రోల్ చేస్తున్న నెటిజెన్లకు, అభిమానులకు సమాధానం చెప్పింది. మరి సమంతకి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ లో తనకిష్టమొచ్చిన విధంగా ఆమె ఉంటుంది. ఆమె ఎలా ఉంటే వీళ్ళకెందుకు చెప్మా!