సమంత అందరిలాంటి అమ్మాయ్ కాదు..!


ఆలోచనలు వింతపోకడలు పోతున్నాయి. ఓ కవి చెప్పినట్లు ‘పురుషుడి స్పర్శతోనే ఆడదాని శీలం పోతుంది అనుకుంటే.. పెళ్లయిన ఆడవారిలో శీలం లేదనా? లేక మొగడన్న వాడెవ్వడూ మగాడు కాదు అనా.. శీలం అంటే గుణం అని అర్ధం’ అని గొప్పగా వివరించాడు. సందర్భం కాకపోయినా కూడా నేటి యువత స్వాతంత్య్రం, పురుషులతో సమానమైన హక్కు.. మేజర్‌ అయితే చాలు తమ ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా బతకడమే అనుకుంటున్నారు. మరికొందరు స్త్రీలు ఓ అడుగు ముందుకేసి తమకిష్టమైన వేషధారణలోని స్వాతంత్య్రం, సమానత్వం ఉన్నాయని భావిస్తున్నారు. 

ఇక విషయానికి వస్తే నేటి యువతకు సమంతను ప్రతినిధిగా చెప్పుకోవచ్చు. ఆమె తన భావాలను ఎలా స్వతంత్య్రంగా వెల్లడిస్తుందో తన వేషభాషలు, దుస్తుల విషయంలో కూడా అంతే స్వేచ్చగా ఉంటుంది. పెళ్లి అనేది మనిషికే గానీ మనిషిలోని స్వాతంత్య్రానికి కాదనేది ఆమె అభిమతం. తాజాగా ఆమె తన భర్తతో కలిసి స్పెయిన్‌లోని ఓ దీవిలో వేకేషన్స్‌ గడుపుతోంది. ఈ సంద్భంగా కాస్త పొట్టిదుస్తులు, కళ్లకు కూలింగ్‌ గ్లాస్‌లు, నుదిటి మీద చేతిని పెట్టుకుని ఉన్న ఆమె ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. వీటిని తానే ఇష్టపడి తన శ్రీవారు నాగచైతన్య ఎంతో ప్రేమగా తీసిన జ్ఞాపకాలు. అలా ఆమె తీయించుకున్న హాట్‌ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. 

‘మానసిక ప్రశాంతత’ని ఆమె ఆ ఫొటోకి క్యాప్షన్‌ పెట్టింది. ఈ ఫొటోని ఆమె పోస్ట్‌ చేసిన మొదటి నాలుగుగంటలోనే 5లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. పెళ్లయిన తర్వాత కూడా గ్లామర్‌ను ఒలకబోస్తూ సమంత కనిపిస్తున్న ఈ ఫొటో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ వేకేషన్స్‌లో అఖిల్‌, స్టైలిష్‌ శిల్పారెడ్డి కూడా ఉన్నారు. తాజాగా తన ఫ్యామిలీతో నాగార్జున కూడా వారితో జాయిన్‌ అవ్వడం విశేషం. 

Samantha not a Ordinary Woman :

Samantha Have Extra Qualities
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES