RX100 అనే బోల్డ్ మూవీ తో కార్తికేయ టాలీవుడ్ హీరోగా పరిచయం అయ్యాడు. RX100 సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ సినిమా గా నిలిచింది. అజయ్ భూపతి దర్శకుడిగా తెరకెక్కిన ఆ సినిమాలో హీరోగా కార్తికేయ కు మంచి పేరొచ్చింది. ఇక ఈ RX100 సినిమా హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అవుతుంది. అలాగే RX100 సినిమా నిర్మాతలకు RX100 సినిమా లాభాల పంట పండించింది. RX100 చిత్రం తర్వాత కార్తికేయ హీరోగా టి. ఎన్ కృష్ణ దర్శకత్వంలో హిప్పీ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఆసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కార్తికేయ మరో సినిమాకి సైన్ చేసాడు.
RX100 సినిమా తర్వాత భిన్నమైన కథలు కార్తికేయను వెతుక్కుంటూ వస్తున్నప్పటికీ.. కార్తికేయ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. తాజాగా కార్తికేయతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మతలు పోటీ అపడుతున్న సమయంలో కార్తికేయ మాత్రం వెంకట్ చంద్ర దర్శకత్వంలో సాహసం చేయరా డింభకా నిర్మాత ఎం ఎస్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో కుస్తీ నేపథ్యం ఉన్న కొత్త కథతో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. సాహసం చేయరా డింభకా తో నిర్మాతగా పేరుతెచ్చుకున్న ఎం ఎస్ రెడ్డి వెంకట్ - కార్తికేయ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ రెజ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని కార్తికేయ వచ్చే ఏడాది మొదలు పెట్టనున్నాడు. వచ్చే ఏడాది నుండే వెంకట్ చంద్ర - కార్తికేయ - ఎం ఎస్ రెడ్డి ల కాంబో సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.