ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటే ఒకరు సల్మాన్‌ఖాన్ పేరు చెబుతారు. మరికొందరు తమకి ఇష్టమైన వివాహం కాని హీరోల పేర్లు చెబుతారు. కానీ నిజానికి అందరిలోకి 'బాహుబలి'తో నేషనల్ ఐకాన్‌గా మారిన యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ పేరును మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతారు. ఆయన నటించే చిత్రాల కోసమే కాకుండా ఆయన ఎవరిని వివాహం చేసుకుంటాడు? అనే విషయంపై జాతీయ మీడియా కూడా బాగా కన్నుపెట్టి ఉంది. ఆయన నేడు ఇండియాలో కొత్తగా అన్ని భాషా సినీ ప్రేక్షకుల దృష్టిలో విపరీతమైన క్రేజ్ ఉన్న నయా సూపర్‌స్టార్ అనడంలో సందేహం లేదు. ఇక 'బాహుబలి' తర్వాత ఆయన ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్‌కి థీటుగా రూపొందుతున్న 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. అదే సమయంలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీని కూడా చేస్తున్నాడు. 'సాహో' కోసం 'బాహుబలి' నాటి కండల శరీరంతోనే కనిపించనున్న ఆయన జిల్ రాధాకృష్ణ చిత్రం కోసం మాత్రం లవర్‌గా కనిపించేందుకు భారీగా బరువు తగ్గి హ్యాండ్సమ్ లుక్‌లోకి మారుతున్నాడు.
ఇక విషయానికి వస్తే అక్టోబర్ 23వ తేదీన ఈయన జన్మదినోత్సం, ప్రస్తుతం అందరి చూపు ఇదే తేదీపై పడింది. కారణం ఆరోజున ఆయన నటిస్తున్న 'సాహో'కి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఆయన వివాహ ప్రకటన కూడా వస్తుందని ప్రచారం మొదలైంది. ఇంకేముంది ఆయన అభిమానుల్లోనే కాదు.. సాధారణ ప్రేక్షకులలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ తేదీపై అందరి చూపు పడింది. తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్న ఆయన పెళ్లికి సంబంధించిన న్యూస్‌ని ఆ తేదీన ఆయన కుటుంబ సభ్యులు ప్రకటిస్తారని తెలుస్తోంది.
మరి ఇదే నిజమైతే ఈ ఏడాది అత్యంత సంచలన, అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ప్రకటన ఇదే అవుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఈ మాట నిజమైతే వచ్చే ఏడాదే ఆయన ఓ ఇంటివాడు కావడం ఖాయమని అంటున్నారు. మరి ఆ వార్త కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.