Advertisement
Google Ads BL

నానాపాటేకర్‌ ఇలాంటి వాడా..?


ఆయన ఆస్తినంతా మహారాష్ట్రలోని పేదల కోసం, రైతుల కోసం రాసిచ్చిన నటుడు నానా పాటేకర్‌. తను ఓ సింగిల్‌రూంలో తన తల్లితో ఉంటూ పెళ్లికి కూడా దూరంగా ఉండి, ఆయన చేస్తున్న సామాజిక సేవలకు, సినీ రంగంలోకి పేద, వృద్ద కళాకారులకు చేసే సాయం తెలిసి అందరు ఆశ్చర్యపోయారు. మనిషిగానే కాదు.. నటునిగా ఆయన దేశం గర్వించదగ్గ నటుడు అనడంలో కూడా సందేహం లేదు. కానీ ఆయనపై తాజాగా 'వీరభద్ర' హీరోయిన్‌ తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసింది. 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' అనే చిత్రంలోని సోలో సాంగ్‌ చిత్రీకరణలో నానా పాటేకర్‌ కొరియోగ్రాఫర్‌లను కూడా పక్కకి పంపివేసి నా చేతిని అసభ్యంగా తాకి, ఆ పాటకి తానే తనకు డ్యాన్స్‌ నేర్పిస్తానని లైంగిక వేధింపులకు పాల్పడాడ్డని, అది సోలో సాంగ్‌ అయినప్పటికీ తాను కూడా అందులో యాక్ట్‌ చేస్తానని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది. 

Advertisement
CJ Advs

తాను అందుకు అంగీకరించక పోవడంతో ఆయన రాజకీయ పార్టీలకు చెందిన వారిని సెట్‌కి తెప్పించి గొడవ చేశాడని దాంతో తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నానని తెలిపింది. దీనిపై ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన గణేష్‌ ఆచార్య స్పందించాడు. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదు. అది చాలా పాత విషయం. అందువల్ల నాకు సాంగ్‌ బాగా గుర్తు లేదు. నాకు గుర్తున్నంత వరకు అది సోలో సాంగ్‌ కాదు. డ్యూయెట్‌ సాంగ్‌. ఆరోజు ఏదో జరగడం వల్ల షూటింగ్‌ మూడు గంటల పాటు ఆగిపోయిన విషయం మాత్రం నాకు గుర్తుంది. అక్కడ అపార్ధాలు చోటు చేసుకోవడం వల్ల అలా జరిగిందే గానీ నానా అసభ్యంగా ప్రవర్తించడం, రాజకీయ పార్టీలకు చెందిన వారిని సెట్స్‌లోకి తీసుకుని రావడం మాత్రం జరగలేదు. నిర్మాతలు రిహాల్సర్స్‌ అప్పుడు పాటలో నానా కూడా ఉన్నాడని తెలిపారు. 

ఆ సమయంలో చిత్ర యూనిట్‌తో నాకు ఎలాంటి ఒప్పందం లేదు. ఎందుకంటే అప్పట్లో నేను మాట మీదే పనిచేశాను. ఆ పాటలో అసభ్యకర దృశ్యాలేమీ లేవు. అది పూర్తిగా డ్యాన్స్‌తో కూడిన పాట. ఆ పాట నుంచి తనుశ్రీ వెళ్లిపోవడం వల్ల రాఖీ సావంత్‌ని తీసుకోవడం అనేది పూర్తిగా నిర్మాతల నిర్ణయం. నానా చాలా మంచి వ్యక్తి. తనుశ్రీ ఆరోపించినట్లు ఆయన ఎప్పుడు అలా బిహేవ్‌ చేయలేదు. నానా పాటేకర్‌ చిత్ర సీమకి చెందిన వారికే కాదు. ఎందరికో ఎన్నో సాయాలు అందజేసిన ఉన్నతమైన వ్యక్తి అని తెలిపాడు. మరి ఈ విషయంలో నిజం ఆ పెరుమాళ్లకే ఎరుక అని చెప్పాలి...! 

Tanushree Dutta's shocker about Nana Patekar, casting couch:

Shocker: Popular Star Forced HER On Sets  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs