మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి సొంతంగా కథలు తయారు చేసుకునే అలవాటు లేదేమో? గత కొంత కాలం నుండి అంతా.. ఇతర భాషల సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వాటిని మన తెలుగు సినిమాలకి తగ్గట్టుగా మార్చి ఇన్స్పిరేషన్ అనే పేరును తగిలిస్తున్నారు. వీరికి సొంతంగా ఆలోచనలు రావడం లేదో తెలియదు కానీ ఇలా చాలామంది డైరెక్టర్స్ అండ్ రైటర్స్ చేస్తున్న పని మాత్రం అదే. రీసెంట్ గా త్రివిక్రమ్ ఓ విదేశీ సినిమాను తీసుకొచ్చి తన సొంత కథ అన్నట్టు బిల్డప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమా తీసిన సంగతి తెలిసిందే.
సినిమా రిలీజ్ కి ముందు దాని గురించి ఎంత రచ్చ అయిందో మన అందరం చూసాం. అయినా కానీ మన వాళ్ళు మారలేదు. ఈరోజు విడుదల అవ్వబోతున్న ‘దేవదాస్’ మీద కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో ఈరోజు తేలిపోనుంది. ఇక తాజాగా అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాపై కూడా ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో 2008 లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘బచ్నా ఏ హసీనో’ సినిమాకు ‘మిస్టర్ మజ్ను’ సినిమాకు దగ్గర పోలికలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇందులో రణబీర్ జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. ఆ ముగ్గురు అమ్మాయిల్లో రణబీర్ కి ఎవరిది నిజమైన ప్రేమో తెలుసుకుని వారిని దక్కించుకుంటాడు. ఇది మూవీ స్టోరీ.
ఈ సినిమాలో దీపికా పదుకునే, బిపాసా బసు, మినిస్సా లాంబా హీరోయిన్స్ గా నటించారు. ఇందులో ఒక పాత్ర విదేశీ అమ్మాయి తరహాలో ఉంటుంది. ‘మిస్టర్ మజ్ను’ టీజర్ చూస్తుంటే ఆ పోలికలు కనిపిస్తున్నాయి. టీజర్ లో అఖిల్ ఓ విదేశీ అమ్మాయితో రొమాన్స్ చేస్తునట్టు కనిపిస్తాడు. ఆమె చుట్టూ మిస్ మిస్ అని తిరగడం చూసాం. మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ చేస్తుంది. అలానే మూడో హీరోయిన్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ హీరోయిన్ పేరు బయటికి తెలియనీయడం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ‘తొలిప్రేమ’ లాంటి ఫీల్ గుడ్ మూవీని మనకు అందించిన వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ లో ఈసినిమా రిలీజ్ కానుంది.