Advertisement
Google Ads BL

నాని తన యాటిట్యూడ్‌ మరలా చూపించాడు!


ప్రస్తుతం తమదైన యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న యువస్టార్స్‌లో నాని, విజయ్‌ దేవరకొండలను ప్రముఖంగా చెప్పుకోవాలి. విజయ్‌దేవరకొండ యాటిట్యూడ్‌ ఏమిటనేది అందరికీ బాగా తెలిసిందే. ఈ విషయంలో మాటలతో మాయ చేసే నానికి కూడా ప్రత్యేకమైన స్టైల్‌ ఉంది. ఆయన తన ప్రతి చిత్రం విడుదలకు ముందు తానే స్వయంగా తన మాటలతో కూడిన ప్రమోషనల్‌ వీడియాలను తీస్తూ వాటినే ప్రచారానికి వాడుతూ ఉంటాడు. వాటికి అనూహ్యమైన స్పందన కూడా వస్తూ ఉంటుంది. స్వతహాగా దర్శకుడు కావడం వల్ల కాబోలు ఈయనలో సృజనాత్మక కూడా చాలా ఎక్కువ. ఇక సెప్టెంబర్ 27 నాగార్జున, నాని నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’ చిత్రం విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్‌లో ఇప్పటికే నానికి సెల్‌ఫోన్లంటే ఉన్న పిచ్చిని చెబుతూ నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి ప్రమోషన్స్‌ వేగాన్ని డిఫరెంట్‌గా, ఆసక్తిని పెంచాడు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు ఆ వంతు నానికి వచ్చింది. ఆయన కూడా  తక్కువ తినలేదని నిరూపిస్తూ నాగార్జున గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నాగ్‌లో అన్ని చెడు లక్షణాలే ఉన్నాయంటూ నాని నాగార్జునలోని మంచి లక్షణాలన్నింటిని తనకు చెడుగా కనిపిస్తాయనే కోణంలో నాగ్‌ గురించి వివరించాడు. నాగ్‌ పొద్దు పొద్దునే లేస్తాడు. సమయానికి షూటింగ్‌కి వస్తారు. సమయానికి తింటారు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత కూడా సమయానికే షూటింగ్‌కి వస్తారు. సమయానికి షూటింగ్‌ నుంచి వెళ్లిపోతారు. ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయిస్తారు. అలా అని లైఫ్‌ని ఎంజాయ్‌చేయకుండా ఉంటారా? లేదు. ఫుల్‌గా ఎంజాయ్‌చేస్తారు. ట్రిప్‌లకు వెళ్తారు. అన్ని పర్‌ఫెక్ట్‌గా చేస్తారు.. ఇవ్వన్నీ నాకు చెడు లక్షణాలే. నాకు తెలిసి 2019 న్యూఇయర్‌కి ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? అనే విషయాలన్ని ఆయన ఇప్పటికే ప్లాన్‌ చేసుకుని ఉంటారు. ఇంత ప్లానింగ్‌తో, ఇంత పర్‌ఫెక్ట్‌గా మీ స్నేహితుల్లో ఎవరైనా ఉంటే వెంటనే ట్యాగ్‌ చేయండి..అంటూ వీడియోలో మాట్లాడారు. 

నిజమే.. నాని చెప్పినవన్నీ నిజమే. కాబట్టే నాగార్జున నటునిగా, తండ్రిగా, కొడుకుగా, వ్యాపారవేత్తగా, భర్తగా, మామగా అన్ని పాత్రల్లోనూ తన జీవితాన్ని పరిపూర్ణంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ, సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ, ఈ వయసులో కూడా తన గ్లామర్‌ని, హ్యాండ్సమ్‌లుక్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడు. 

Nani Sensational Comments on Nagarjuna:

Nani Promotes Devadas in his own style 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs