Advertisement
Google Ads BL

విన్నరెవరు? బిగ్‌బాస్.. తలబాదుకుంటున్నాడా?


తెలుగు బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. బయట కూడా అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ టు లో మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేని జనాలు.. చివరికి వచ్చేటప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాని చెప్పినట్టు ఏదైనా జరగొచ్చు అన్నట్టుగా రోజుకో గడబిడ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ వన్ సాఫీగా జరిగినట్టుగా సీజన్ 2 జరగడం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కి బయట బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ అంటూ ఒకటి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుది కాదు. ఆ కౌశల్ ఆర్మీ అనేది బిగ్ బాస్ సృష్టించిందా? లేదా కౌశల్ ఏర్పాటు చేసుకుందా? లేదంటే నిజంగానే కౌశల్ కి అంత ఫ్యాన్ ఆర్మీ ఉందా? అనేది క్లారిటీ లేదు. ఏది ఏమైనా కౌశల్ ఆర్మీతో బిగ్ బాస్ కి తలనొప్పి స్టార్ట్ అయ్యిందనేది వాస్తవం. ఇక హౌస్ లోతనీష్ చెప్పినట్టుగా బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ తో ఎవరు పెట్టుకున్నా.. వారి ఎలిమినేట్ అవడం తథ్యం... అన్నట్టుగా కౌశల్ తో గొడవ పడినవారు వారానికొకరు చొప్పున బయటికొచ్చేశారు. 

Advertisement
CJ Advs

ఇక కేవలం అది కౌశల్  ఆర్మీ వలనే తాము టార్గెట్ అయ్యి హౌస్ నుండి బయటికొచ్చామని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయట ఇంటర్వూస్ లో చెప్పడంతో.. నిజంగానే కౌశల్ ఆర్మీకి అంత పవర్ ఉందా అనుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని తనీష్ ని బిగ్ బాస్ కి రికమెండ్ చేసాడని.. తనీష్ తప్పులని నాని ఎత్తి చూపకుండా సేఫ్ జోన్ లో ఉంచుతున్నాడని కూడా బయట టాక్. మరోపక్క గీత ఫిజికల్ గా స్ట్రాంగ్‌గా లేకపోయినా.. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది... సీక్రెట్ టాస్క్ లు బాగా ఆడడంతో... ఆమెని ఫైనల్ వరకు తెచ్చారనే టాక్ ఉంది. మరోపక్క ఫిజికల్ గా స్ట్రాంగ్‌గా ఉండి... చిన్నపిల్లాడిలా ఉండే సామ్రాట్ కూడా ఫైనల్స్ కి డౌటే అంటున్నారు. మరోపక్క బిగ్ బాస్ కూడా కౌశల్ ఆర్మీకి భయపడే స్క్రిప్ట్ ని మారుస్తుందని బయట టాక్ ఉంది. ఇక దీప్తి నల్లమోతు మాత్రం ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్‌గా తయారైంది.

తాజాగా బిగ్ బాస్ టైటిల్ అనేది ఇప్పుడు ఎవరికీ వచ్చినా అది ఎవరో ఒకరి రికమండేషన్ అనే ప్రమాదంలో బిగ్ బాస్ పడ్డాడు. అంటే బిగ్ బాస్ ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కమాదిరిగా నలిగిపోతున్నాడన్నమాట. బిగ్ బాస్ టైటిల్ కౌశల్ కి ఇస్తే కౌశల్ ఆర్మీకి భయపడే బిగ్ బాస్ కౌశల్ కి టైటిల్ కట్టబెట్టారంటారు. మరి నిజంగానే బయట వాతావరణం అలానే ఉంది. బిగ్ బాస్ టైటిల్ కౌశల్ కి రాకపోతే నానా రచ్చ జరిగేలా కౌశల్ ఆర్మీ ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశలే అని కౌశల్ మాత్రమే కాదు కౌశల్ ఆర్మీ కూడా ఫిక్స్ అయ్యారు. ఇక ఒకవేళ తనీష్ కి బిగ్ బాస్ టైటిల్ వచ్చిందా.. అందులో నాని హ్యాండ్ ఉందని అంటారు. ఇప్పటికే తనీష్ ని నాని కాపాడుతున్నారనే టాక్ ఉంది. మరోపక్క గీత కి బిగ్ బాస్ టైటిల్ ఇచ్చినా.. ఆమెకెలా ఇస్తారు ఆమె ఎమన్నా స్ట్రాంగ్ గా ఉందా... ఎప్పుడూ ఆడవాళ్ళతో ముచ్చట్లు తప్ప అంటారు. ఇక సామ్రాట్ కిస్తే.. ఇలా ఎలా ఇస్తారు. సామ్రాట్ ఎందులో స్ట్రాంగ్ అంటారు. ఇక మెయిన్ బిగ్ బాస్ ముందున్న ఆప్షన్ అల్లా దీప్తి నల్లమోతు మాత్రమే. దీప్తి నల్లమోతుకి బయట కూడా మంచి ఫాన్స్ ఉన్నారనేది.. ఆమెని ఎలిమినేషన్స్ నుండి కాపాడుతున్న దాన్నిబట్టి కొద్దిగా అర్ధమవుతుంది. టీవీ 9 యాంకర్‌గా ఆమె బిగ్ బాస్ లో కూడా మంచి పేరే తెచ్చుకుంది. చూద్దాం ఫైనల్ గా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలేలో..!! 

Bigg Boss in Troubles:

Who is The winner? Analysis on Bigg Boss Winner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs