హైదరాబాద్ మరియు విజయవాడల్లో నోటా పబ్లిక్ మీట్..
నోటా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. విడుదలకు ముందే విజయవాడ, హైదరాబాద్ లలో రెండు భారీ పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న విజయవాడ.. అక్టోబర్ 1న హైదరాబాద్ లో ఈ మీటింగులు జరగనున్నాయి. ఈ మీటింగ్స్ ను ‘ది నోటా పబ్లిక్ మీట్’ అని పేరు పెట్టేసారు దర్శక నిర్మాతలు. విజయ్ దేవరకొండ, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రల్లో నటించిన పొలిటికల్ డ్రామా నోటా.
మెహ్రీన్ ఇందులో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ రెడ్డి.. గీతగోవిందం లాంటి సంచలన సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తోన్న సినిమా ఇది. ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా నోటా విడుదల కానుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శాంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.