Advertisement
Google Ads BL

‘సాహో సార్వభౌమి’ వస్తోంది


సువర్ణసుందరి నుంచి ‘సాహో సార్వభౌమి’ సాంగ్ 28న విడుదల

Advertisement
CJ Advs

తెలుగు సినిమా ఒరవడి మారింది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరిగింది. మన దర్శకులు సైతం సరికొత్త విధానాలతో సినిమాలను రూపొందిస్తున్నారు. అదే కోవలో నాలుగు జన్మలను మిళితం చేస్తూ రోలర్ కొస్టర్ స్ర్కీన్‌ప్లేతో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ‘సువర్ణ సుందరి’ తెరకెక్కుతోంది. సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి ‘సాహో సార్వభౌమి’ అనే పాటను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు.

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న ఈ సినిమాను ఓ హిస్టారికల్ అడ్వెంచర్‌గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో వచ్చిన ‘సువర్ణ సుందరి’ టీజర్ విడుదలై సోషల్  మీడియాలో వైరల్‌గా మారింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి.

Suvarna Sundari Movie Song Release on Sep 28:

Suvarna Sundari Movie Saaho Sarvabhowma Song Release Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs