Advertisement
Google Ads BL

తాత పాత్ర గురించి ఫస్ట్ టైమ్ సుమంత్..!!


పౌరాణిక పాత్రలు, బయోపిక్‌లు చేసేటప్పుడు మామూలుగా కంటే రెండు మూడు రెట్లు గెటప్‌ కోసం, నటన కోసం కష్టపడాలి. అదే సమయంలో ఎంతో బాధ్యతగా కూడా చేయాల్సివుంటుంది. ఈ విషయంలో పౌరాణిక పాత్రలు చేసేటప్పుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ అనే వారు ఎంతో నిష్టతో కష్టపడే వారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌లో టైటిల్‌ పాత్రను పోషిస్తున్నారు. సాధారణంగానే సినిమా షూటింగ్‌ అంటే బాలయ్య ఎంతో భక్తి శ్రద్దలతో పట్టుదలగా చేస్తాడు. ఈ విషయంలో ఆయనను తండ్రికి తగ్గ తనయుడు అనే అనాలి. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఈ చిత్రంలో నారాచంద్రబాబు నాయుడుగా చేస్తోన్న దగ్గుబాటి రానా సెట్స్‌లో ఎలా ఉన్నాడో ఆయన తండ్రి సురేష్‌బాబు చెప్పుకొచ్చాడు. మరోవైపు ఏయన్నార్‌ పాత్రని చేస్తోన్న ఆయన మనవడు సుమంత్‌ గెటప్‌ని చూసే అందరు ఫిదా అయ్యారు. తాను చూస్తోంది ఏయన్నార్‌నా? లేక సుమంత్‌నా? అని వెంకటేష్‌ కూడా సంతోషంగా చెప్పాడు. 

తాజాగా సుమంత్‌ ఈ చిత్రం షూటింగ్‌ విశేషాలను వెల్లడించాడు. తొలిరోజున ఎన్టీఆర్‌ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారు. నేను, చంద్రబాబు పాత్రధారి రానాతో కలిసి నటించాను. తొలిరోజు షూటింగ్‌కి నేను తాతయ్య వాడిన చివరి కారులో వెళ్లాను. ఆయనను తెరమీద ఆవిష్కరిస్తున్నానన్న భావన మది నిండా నిలిచి ఉంది. ఓ బాధ్యతగా ఈ చిత్రాన్ని చేస్తున్నానని తెలిపాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని క్రిష్‌ అద్భుతంగా, ఎంతో వేగంగా తీస్తున్నాడని టాక్‌. 

Sumanth about NTR Movie ANR Role:

Sumanth shares 1st day Shooting Experience of NTR Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs