Advertisement
Google Ads BL

దీనికే.. బ్రేకప్పా.. రష్మికా..??


ఈ ఏడాది సూపర్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి 100  కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవడమైతే.. మరో సెన్సేషన్ గీత గోవిందంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న తన ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకోవడం. ఈ రెండు సూపర్ సెన్సేషనే. అయితే గీత గోవిందం హిట్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఉన్నట్టుండి తన లవర్ రక్షిత్ తో చేసుకున్న ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది. కారణాలు క్లారిటీ లేవు గాని... రష్మిక ఎంగేజ్మెంట్ రద్దు అయ్యిందని ప్రకటించిన రష్మిక తల్లి మాత్రం... ఈ విషయంలో కొన్ని రోజులుగా బాధపడుతున్నట్టుగా చెప్పడం... అలాగే రష్మిక బ్రేకప్ చేసుకున్న హీరో రక్షిత్ ఈ విషయంలో రష్మిక తప్పేం లేదని లేఖ ఒకటి రాయడం జరిగాయి.

Advertisement
CJ Advs

ఇంత జరిగినా రష్మిక మందన్న తన ఎంగేజ్మెంట్ ని ఎందుకు బ్రేకప్ చేసుకుందో మాత్రం కరెక్ట్ కారణం తెలియలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక చెప్పుడు మాటలకు పడిపోయి.. తన ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుందనే న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. అది కూడా రష్మిక తన మేనేజర్ చెప్పిన మాటలతోనే ఈ లవ్ ని బ్రేకప్ చేసుకుందట. కెరీర్ బావున్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటే గ్లామర్ ఇండస్ర్టీలో కెరీర్ కంటిన్యూ కావడం కష్టమని రష్మిక మేనేజర్ చెప్పడం... అలాగే కన్నడ కన్నా తెలుగుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని కూడా చెప్పాడట.  శాండిల్‌వుడ్‌ని ఎంత దూరంగా పెడితే.... టాలీవుడ్‌లో అవకాశాలు తన్నుకుంటూ వస్తాయంటూ రష్మికకు ఆమె మేనేజర్  మాయ మాటలు చెప్పినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. మేనేజర్ చెప్పిన మాయ మాటలకు పడిపోయిన రష్మిక వెనక ముందు చూడకుండా రక్షిత్ కి బ్రేకప్ చెప్పిందని అంటున్నారు.

మరి చాలామంది హీరోయిన్స్ ఇలా మేనేజర్లు మాయలో పడి సర్వస్వము చేజార్చుకున్నారు. ఇప్పుడు రష్మిక కూడా మేనేజర్ మాయలో పడితే ఇంకేముంది. మరి రష్మిక రేపు విడుదలకాబోతున్న దేవదాస్ చిత్రంలోనూ, లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పక్కన రెండోసారి డియర్ కామ్రేడ్ చిత్రాల్లోనూ నటిస్తుంది. ఇప్పటికే ఛలో, గీత గోవిందం సినిమాలతో రష్మిక హిట్స్ కొట్టి సూపర్ క్రేజ్ సంపాదించింది.

Reason for Rashmika and Rakshit Breakup:

Rashmika mandanna Breakup Reason
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs