Advertisement
Google Ads BL

రోల్‌రైడా అవుట్..స్వీయ తప్పిదమే కారణమా?


బిగ్‌బాస్‌ సీజన్‌2 చివరి అంకానికి చేరుకుంది. మరో వారంలో ఈ షో ముగియనుంది. ఇప్పటికే సామ్రాట్‌ హౌస్‌మేట్స్‌ సపోర్ట్‌తో డైరెక్ట్‌గా ఫైనల్‌కి చేరాడు. అందరు ఊహించినట్లే రోల్‌రైడా ఈవారం హౌస్‌ని వీడాడు. ప్రేక్షకుల ఓట్లలో సామ్రాట్‌, రోల్‌రైడాలకే తక్కువ ఓట్లు వచ్చాయి. నిజానికి రోల్‌రైడాది స్వీయ తప్పిదమే. ఆయన తన గోతిని తానే తవ్వుకున్నాడు. షో మొదటి నుంచి సేఫ్‌గా ఆడుతూ వచ్చిన రోల్‌రైడా ఎంత సేపటికి హౌస్‌మేట్స్‌ మద్దతు కోసం పాకులాడాడే తప్ప ప్రేక్షకులపై దృష్టి పెట్టి వారిని ఆకట్టుకోవడంలో విఫలయ్యాడు. ఈ విషయంలో కౌశల్‌ చూపిన చాకచక్యాన్ని, లౌక్యాన్ని రోల్‌రైడా చూపించలేకపోయాడు. 

Advertisement
CJ Advs

ఎగ్‌ టాస్క్‌లో కౌశల్‌ మినహా రోల్‌రైడాకి హౌస్‌మేట్స్‌ ఎవ్వరు మద్దతు ఇవ్వలేదు. ఇంతకాలం కాపాడుతారని ఆయన భావించిన వారే ఆయనకు వాత పెట్టారు. ఎగ్‌ టాస్క్‌లో ఓడిపోవడం వల్ల సామ్రాట్‌ తంతే గారెల బుట్టలో పడ్డట్టు పడ్డాడు. సామ్రాట్‌ ఎలిమినేషన్స్‌కి వచ్చినా కూడా ఆయన కూడా తక్కువ ఓట్లతోనే గట్టెక్కాడు. రోల్‌రైడా, సామ్రాట్‌ని టార్గెట్‌ చేసుకుని ఉంటే ఆయన బదులు రోల్‌రైడానే ఫైనల్‌కి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ సువర్ణావకాశాన్ని రోల్‌రైడా చెడగొట్టుకున్నాడు. ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పెంచుకుంటున్న కౌశల్‌తో గొడవకు దిగడం కూడా రోల్‌రైడా ఎలిమినేషన్‌కి కారణమైంది. 

కౌశల్‌తో అనవసర గొడవ పెట్టుకుని, సంబంధం లేని వ్యాఖ్యలతో గొడవ పెద్దది కావడానికి తానే ఆజ్యం పోసుకున్నాడు. ఇది కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. పైగా గల్లీపోరడినని చెప్పుకునే రైడా ఆ గొడవ సందర్భంగా కౌశల్‌ కాళ్లు పట్టుకోవడం, ఏడవటం ఆయనలోని వ్యక్తిత్వ లోపాన్ని చూపించి ప్రేక్షకులకు వెగటు పుట్టించాయి. ఇదే అంశంపై హోస్ట్‌ నాని కూడా రోల్‌రైడాని మందలించిన సంగతి తెలిసిందే.

Roll Rida out From Bigg Boss:

This is the Reason for Roll Rida Elimination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs