Advertisement
Google Ads BL

చిరు, పవన్ ఇద్దరూ ఒకటే: చరణ్‌రాజ్‌!


చరణ్‌రాజ్‌.. తెలుగు ప్రేక్షకులకే కాదు.. దక్షిణాది ప్రేక్షకులందరికి సుపరిచితమైన పేరు. టి.కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో రామోజీరావు నిర్మించిన ‘ప్రతిఘటన’ ద్వారా తెలుగులో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత చిరంజీవితో పాటు ఎన్నో చిత్రాలలో తన సత్తా చాటాడు. ఇతర భాషల్లో హీరోగా కూడా నటించాడు. నటనలో ఆయన గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

Advertisement
CJ Advs

తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్‌ చిరంజీవి చాలా హార్డ్‌వర్కర్. ఏదైనా సీన్‌ గానీ, ఫైట్‌ గానీ, డ్యాన్స్‌ గానీ, డైలాగ్‌ గానీ పర్‌ఫెక్ట్‌గా వచ్చేవరకు ఆయన దేనిని వదిలిపెట్టడు. అంతటి డెడికేషన్‌ ఆయన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌లో కూడా చూశాను. పవన్‌ చాలా స్వీట్‌ వర్కర్‌. ఎవ్వరికి అపకారం చేసే మనస్తత్వమున్న వ్యక్తికాదు. తన పని మాత్రమే ఆయన చూసుకుంటారు. పక్కవారి విషయాలలో వేలు పెట్టడం గానీ, విమర్శించడం మాత్రం చేయరు. చిరంజీవి, పవన్‌ ఇద్దరు గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులు. పవన్‌ నటించిన ‘గుడుంబాశంకర్‌’లో అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఆ తర్వాత ‘పులి’(కొమరం పులి) చిత్రంలో నటించాను. చిన్నవయసులోనే ప్రజలకు మేలు చేసేందుకు పవన్‌ రాజకీయాలలోకి వచ్చారు. ఆయనకు ఇంత చిన్నవయసులోనే ఆ ఆలోచన రావడం దైవేచ్చ. ప్రజలు ఆయనకు మద్దతు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. 

ఇక చరణ్‌ రాజ్‌ మాటలు ఎలా ఉన్నా.. ఆయన సొంత అభిప్రాయాన్ని మనం కాదనలేం గానీ ఆయన చిరంజీవి గురించి చెప్పింది మాత్రం వాస్తవం. లేకపోతే షష్టిపూర్తి వయసులో దశాబ్దం గ్యాప్‌ తర్వాత చేసిన ‘ఖైదీనెంబర్‌ 150’లో కూడా చిరులో అదే పట్టుదల, తపన, ఇంకా బాగా చేయాలనే పట్టుదల ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ పవన్‌కళ్యాణ్‌ విషయం వేరు. ఆయన తానే చాలా సార్లు తనకి నటించడం ఇష్టం లేదని, ఏదో నటించాలి కాబట్టి నటిస్తున్నానని చెప్పి ఉన్నాడు. ఆయనకు నటనపై ఉన్న నిర్లక్ష్యం జయాపజయాలను పక్కనపెడితే ‘సర్దార్‌గబ్బర్‌సింగ్‌’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలలో కనిపిస్తుంది. 

ఇక ఈయన కథలు, దర్శకుల విషయంలో కూడా చాలా ఉదాసీనంగా ఉంటాడు. అంతేకాదు.. చాలా చిత్రాల దర్శకుల విషయంలో ఆయన దర్శకత్వం విషయంలో వేలు పెట్టాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతూనే ఉంటాయి. మరి అలాంటి నటునికి చిరంజీవి డెడికేషన్‌తో పోల్చడం సరికాదు. ఇక పవన్‌ వ్యక్తిగత విషయాలలో మాత్రం చరణ్‌ చెప్పింది నిజం. ఆయన రాజకీయాలలోకి వచ్చి తనకిష్టం లేని నటనను వదిలేసి మంచి పని చేశాడనే ఒప్పుకోవాలి. 

Charan Raj About Chiranjeevi and Pawan Kalyan Greatness:

Charan Raj Latest Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs