Advertisement
Google Ads BL

ప్రెగ్నెన్సీపై నటి ఆసక్తికర వ్యాఖ్యలు!


నటి నేహా ధూపియా ఇటీవల తన ప్రియుడు, బాలీవుడ్‌ నటుడు అంగన్‌బేడీని వివాహం చేసుకుంది. గర్భం దాల్చిన మూడు నెలలకు వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే తమ వివాహాన్ని వారు మీడియాకు తెలియనివ్వలేదు. మే నెలలో తమ నివాసంలో పెద్దల సమక్షంలో ఈ ఇరువురి వివాహబంధం తర్వాత ఒకటయ్యారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని ప్రముఖ దర్శక నిర్మాత, నేహా స్నేహితుడు కరణ్‌జోహర్‌ ట్విట్టర్‌ వేదికగా చెప్పే వరకు ఎవ్వరికీ తెలియలేదు. నేహా పెళ్లికి ముందే గర్భం దాల్చడం వల్ల హడావుడిగా, రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని ఈ ఇద్దరు మీడియా ముందు బుకాయించారు. 

Advertisement
CJ Advs

తాజాగా వారు తాము తల్లిదండ్రులను కానున్నామని ప్రకటించారు. అయితే తాను గర్బం దాల్చడం గురించి దాచి పెట్టడంపై నేహా ధూపియా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను గర్బం దాల్చానని చెబితే నాకు సినిమా అవకాశాలు పోతాయని భయపడ్డాను. నాకు ఆరో నెల గర్భం వచ్చే వరకు గర్భం అంతగా పెరగకపోవడం నాకు కలసి వచ్చింది. లేకపోతే విషయం అందరికీ తెలిసిపోయేది. అదృష్టవశాత్తు ఆ సమయంలో కూడా నాకు నటించే ఎనర్జీ ఉండటం ఆనందం కలిగించింది అని చెప్పుకొచ్చింది. 

ప్రముఖ సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌ నటిస్తోన్న 'హెలికాప్టర్‌ ఈలా' చిత్రంలో నేహా ధూపియా కీలకమైన పాత్రను పోషించింది. ప్రదీప్‌ సర్కార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈమె తల్లి అయిన తర్వాత కూడా వేషాలు వస్తాయో లేదో వేచిచూడాల్సివుంది...!

Actress Sensational Comments on her Pregnancy:

Neha Dhupia About Her Pregnancy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs