Advertisement
Google Ads BL

బావ కోసం మహేష్ ఎప్పుడూ ముందుంటాడే..!


సినిమాల విడుదలకు ముందే విపరీతమైన ప్రమోషన్‌ చేస్తే సినిమా బాగుంటే ఫర్వాలేదు.. బాగా లేకపోతే మాత్రం విమర్శలు ఖాయం. ఇక తమ సొంత సినిమా యూనిట్‌కైతే సినిమా ఎలా ఆడుతుంది? అనేది పక్కనపెట్టి సినిమా ఎంతో బాగుంటుందని భాజాలు మోగించడం మామూలే. ఎవరి సినిమాకి వారే డప్పు కొట్టుకోవాలనేది నిజమే. కానీ ఓ చిత్రం గురించి ఇతర సినీ ప్రముఖులు బాగుంది అని ప్రచారం చేయాలంటే మాత్రం కాస్త తొందరపడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే సినిమా విడుదలై మంచి టాక్‌ సంపాదించిన తర్వాత సినీ ప్రముఖులు సినిమా బాగుందని ప్రమోషన్‌ చేస్తే సినిమాకి మరింత బలం పెరుగుతుంది. కాబట్టి సినీ ప్రముఖులెవ్వరైనా సినిమా విడుదలకు ముందు కాకుండా తర్వాత ప్రచారం చేస్తే ఆయా వ్యక్తుల గుడ్‌విల్‌ మరింత పెరుగుతుంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే ఘట్టమనేని ఫ్యామిలీ హీరో, కృష్ణ చిన్నల్లుడు, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు బావ అయిన సుధీర్‌బాబు ఇటీవల నటించిన ‘సమ్మోహనం’ చిత్రాన్ని కూడా విడుదలైన తర్వాతే మహేష్‌బాబు బాగా మెచ్చుకోవడమే కాదు.. ఆ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ చిత్రం చేయడానికి ఆసక్తి చూపించాడు. ఇక తాజాగా సుధీర్‌బాబు మరో చిత్రం ‘నన్నుదోచుకొందువటే’ చిత్రం విడుదలకు ముందు మహేష్‌ ఏమి మాట్లాడలేదు. కానీ తాజాగా విడుదలైన ఈ చిత్రానికి మంచి పాజిటిల్‌ టాక్‌ వచ్చి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా టాక్‌ వచ్చిన తర్వాత మహేష్‌ తనవంతుగా ప్రమోషన్‌ మొదలుపెట్టాడు. ‘నన్ను దోచుకొందువటే’ చిత్రం ఎంతో బాగుందని చాలా గొప్పగా వింటున్నాను. సుధీర్‌బాబు సొంత నిర్మాణ సంస్థను స్ధాపించడం ఎంతో ఆనందంగా ఉంది. సుధీర్‌ ప్రయత్నాలు చూస్తుంటే గర్వంగా కూడా ఉంది. 

ప్రస్తుతం నేను జర్నీలో ఉన్నాను. మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌ వస్తాను. వచ్చిన వెంటనే ఈ చిత్రాన్ని చూస్తాను.. అంటూ ‘నన్నుదోచుకొందువటే’ చిత్రంపై, టీంపై, బావ సుదీర్‌బాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవలి కాలంలో సూపర్‌హిట్‌ అయిన ప్రతి చిత్రం విషయంలో మహేష్‌ చేసిన ట్వీట్స్‌ నిజమయ్యాయి. మరి మహేష్‌ క్రెడిబులిటీని ఈ చిత్రం ఎంతగా నిలబెడుతుందో వేచిచూడాల్సివుంది...! 

Mahesh Babu praises nannu dochukunduvate:

Mahesh Babu tweet on sudheer nannu dochukunduvate
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs