Advertisement
Google Ads BL

ఇంపార్టెంట్ సీన్ లీక్: ‘అరవింద’ టీమ్‌లో టెన్షన్


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత - వీర రాఘవ షూటింగ్ మొదలు పెట్టిన నాటినుండి ఇప్పటి వరకు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మధ్యలో హరికృష్ణ మరణంతో అరవింద సమేత షూటింగ్ కి నాలుగైదు రోజులు ఎన్టీఆర్ బ్రేకిచ్చినప్పటికీ త్రివిక్రమ్ మిగతా వారితో కొన్ని సీన్స్ ని తెరకెక్కించాడు. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాటలు మార్కెట్ లోకి విడుదలైపోయాయి. భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటానికి కూడా సిద్దమవుతుంది. తాజాగా షూటింగ్ చివరిలో ఉన్న అరవింద సమేత సినిమాలోని ఒక పాట కోసం యునిట్ మొత్తం ఫారిన్ వెళ్లింది.. అయితే ఫారిన్ షెడ్యూల్ తో టైం వేస్ట్ అని ముందుగానే అరవింద ఫారిన్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసినప్పటికీ.. త్రివిక్రమ్ ఒక్క పాటకోసమైన ఫారిన్ లొకేషన్ షూట్ చేయాల్సిందేనని.. హారిక వారిని ఒప్పించినట్లుగా వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే సాంగ్ షూటింగ్ కోసం ఎన్టీఆర్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ ఈమధ్యనే ఇటలీ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Advertisement
CJ Advs

సినిమా విడుదలకు సమయం ఆట్టే లేకపోవడంతో ఫారిన్ షెడ్యూల్ వలన కాస్త టైం వేస్ట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందేమో అనే అనుమానాలు మొదలైన వేళ అరవింద లీకులు అరవింద సమేత టీంకి వణుకు పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ అండ్ నాగబాబుకి సంబందించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యగా... ఈ మధ్యనే టీజర్ రిలీజ్ చేసుకున్న అరవింద సమేతకు సంబందించిన కొన్ని సీన్స్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. అరవింద సమేత టీజర్ లో కల్వర్ట్ ఒకటి బ్లాస్ట్ అయ్యే సీన్ ఒకటుంది. ఆ సీన్ కి ఇప్పుడు లీకైన ఈ వీడియో ఎక్స్‌టెన్ష‌న్‌ అన్నట్టుగా కనబడుతుంది.  కల్వర్ట్ బ్లాస్ట్‌కి ముందు ఎన్టీఆర్, నాగబాబు అనుచరులతో కలిసి వస్తున్న దృశ్యాలు… బ్లాస్ట్ తరవాత నాగబాబును ప్రత్యర్థులు కాల్చి చంపే దృశ్యాలు… ఆ వీడియోలో వున్నాయి. 

లీకైన సన్నివేశాలను ఎక్కడా షేర్ చెయ్యొద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. అయితే అరవింద సమేత సీన్స్ ఎక్కడ నుండి లీకయ్యాయి అంటే..  గ్రాఫిక్స్ కోసం పంపితే అక్కడి నుంచి కొన్ని సన్నివేశాలు లీకైనట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ ఇంకా పూర్తి కాకముందే కొన్ని సీన్స్ లీకైనట్టుగా తెలుస్తోంది. గ్రాఫిక్స్ టీంలోని ఎవరో ఈ లీకులు చేసినట్టుగా చెబుతున్నారు. మరి సినిమా విడుదల దగ్గర పడుతున్న టైంలో ఇలా ఏదో ఒకటి లీకై అరవింద టీంని టెంక్షన్ లోకి నెట్టేస్తున్నాయి. 

Aravinda Sametha Action Scene Leaked:

Aravinda Sametha Action Scene Leaked by Film team?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs