నేటి యువతరం దర్శకుల్లో వి.ఐ.ఆనంద్ ఒకరు. ఈయన తమిళనాడులోని ఈరోడ్డులో జన్మించి ఆర్కిటెక్ట్‌గా గోల్డ్‌మెడల్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎ.ఆర్.మురుగదాస్ వంటి వారి వద్ద దర్శకత్వ శాఖల్లో సహాయకునిగా పనిచేశాడు. దర్శకునిగా ఇతని మొదటి చిత్రం 2014లో వచ్చిన 'హృదయం ఎక్కడున్నదీ'. అదే ఏడాది కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. 'అప్పుచ్చిగ్రామమ్' ద్వారా తమిళంలోకి అడుగుపెట్టాడు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెలుగు, తమిళ చిత్రం 'టైగర్'కి దర్శకత్వం వహించాడు. కానీ ఈ చిత్రం కూడా ఆయనకు మంచి కమర్షియల్ హిట్‌ని ఇవ్వలేకపోయింది. కానీ ఆ తర్వాత ఆయన నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా తీసిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం డీమానిటైజేషన్ సమయంలో విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌కి పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మిగలడమే కాదు.... విభిన్న చిత్రాల దర్శకునిగా వి.ఐ.ఆనంద్‌కి ఎక్కడలేని క్రేజ్‌ని సాధించిపెట్టింది.
పెద్దనోట్ల రద్దు సమయంలో దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించి ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' చరిత్ర సృష్టించింది. వెంటనే ఆయనకు గీతాఆర్ట్స్ బేనర్‌లో అల్లుశిరీష్ హీరోగా 'ఒక్కక్షణం' మూవీకి డైరెక్షన్ చాన్స్ వచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అలాంటి వి.ఐ.ఆనంద్‌కి ఇప్పుడు ఓ సువర్ణావకాశం వచ్చింది. కొత్త, టాలెంటెడ్ దర్శకులకు అవకాశాలు ఇచ్చి, ఎందరో స్టార్ దర్శకులకు కెరీర్లకు పునాదిగా నిలిచిన మాస్‌మహారాజా రవితేజని డైరెక్ట్ చేసే అవకాశం తాజాగా ఈయనని వరించిందని సమాచారం.
ప్రస్తుతం రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం విజయ దశమి కానుకగా విడుదల కానుంది. దీని తర్వాత మాస్‌మహారాజా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. దీనితో పాటు రవితేజ వి.ఐ.ఆనంద్ చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం ఆనంద్‌కి సువర్ణావకాశం అని, ఈ చిత్రం ద్వారా ఆయన తన సత్తా చూపించుకునే మహదావకాశం వచ్చిందని చెప్పవచ్చు.