Advertisement
Google Ads BL

హరీష్.. ‘దాగుడు మూతలు’ అయ్యాయా?


టాలీవుడ్‌లో రచయితగా, దర్శకునిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరీష్‌శంకర్‌. ఈయన దర్శకత్వ ప్రతిభ విషయాన్ని పక్కన పెడితే తన చిత్రం బాగా ఆడకపోయినా బాగుందని వాదించడం, మీడియాను తప్పు పట్టడం వంటి విషయాల వల్ల వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన సినీ పరిశ్రమకు ప్రవేశంచిన మొదట్లో 'నిన్నే ఇష్టపడ్డాను' అనే చిత్రానికి రచన, దర్శకత్వ శాఖల్లో పనిచేశాడు. కోనవెంకట్‌ సహకారంతో రవితేజ హీరోగా రూపొందిన 'వీడే' చిత్రానికి కూడా సహాయకునిగా పనిచేసి, తర్వాత పూరీజగన్నాథ్‌ వద్ద చిరుత, బుజ్జిగాడు వంటి చిత్రాలకు పనిచేశాడు. ఇక ఈయనకు రాంగోపాల్‌వర్మ, రవితేజ, జ్యోతిక నటించిన 'షాక్‌' చిత్రం ద్వారా దర్శకునిగా అవకాశం ఇచ్చాడు. విమర్శకుల ప్రశంసలను పొందిన ఈ చిత్రం కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ కాలేకపోయింది. ఈయనకు మొదటి విజయం రవితేజ నటించిన 'మిరపకాయ్‌' ద్వారా వచ్చింది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత పవన్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ నటించిన 'గబ్బర్‌సింగ్‌' చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన 'రామయ్యా.. వస్తావయ్యా' చిత్రం ఫ్లాప్‌ కాగా, 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' చిత్రం ఓకే అనిపించింది. కానీ అల్లుఅర్జున్‌ హీరోగా దిల్‌రాజు నిర్మాతగా హరీష్‌శంకర్‌ తీసిన 'దువ్వాడజగన్నాథం' చిత్రం పలు వివాదాలకు కారణమైంది. ఈ చిత్రం చూసిన వారందరు పెదవి విరిచిన విషయం మాత్రం వాస్తవమే. అయితే ఈ చిత్రం విడుదలై ఇంత కాలం అయినా కూడా హరీష్‌శంకర్‌ తదుపరి చిత్రం మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. 'దాగుడు మూతలు' అనే టైటిల్‌లో కాన్సెప్ట్‌ బేస్‌డ్‌ చిత్రంగా రూపొందించాలని భావిస్తోన్న ఈ చిత్రం కోసం హరీష్‌శంకర్‌ అమెరికాలో లొకేషన్ల వేట కూడా పూర్తి చేశాడు. 

కానీ దిల్‌రాజు మొదట ఈచిత్రం నిర్మించడానికి ముందుకు వచ్చినా తర్వాత తప్పుకున్నాడు. దాంతో హరీష్‌శంకరే యూఎస్‌లోని తన మిత్రులతో కలిసి ఈ చిత్రాన్ని ప్రారంభించను బి న్నాడు. ఒక హీరోగా సుధీర్‌బాబుని ఎంచుకుని, మరో హీరో పాత్రకు రామ్‌ని అడుగుతున్నట్లు సమాచారం. మరి వరుస ఫ్లాప్‌లలో ఉన్న రామ్‌ ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Harish Shankar Dagudu Mootalu Update:

Dagudu Mootalu movie starts soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs