Advertisement
Google Ads BL

'ఎన్టీఆర్‌' రేంజ్ రోజురోజుకి పెరుగుతోంది


నిజానికి తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ రూపొందుతోంది అని వార్తలు వచ్చినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. బాలకృష్ణ అత్యుత్సాహం చూపిస్తున్నాడని, ఎన్టీఆర్‌ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎవ్వరూ చూపించే సాహసం చేయలేరని భావించారు. కారణం ఆయన జీవితంలో ఎన్నో చీకటి రోజులు కూడా ఉన్నాయి. అయితే తేజ నుంచి ప్రాజెక్ట్‌ క్రిష్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఈ చిత్రాన్ని క్రిష్‌ అయితేనే చక్కగా హ్యాండిల్‌ చేస్తాడని ఓ భరోసా వచ్చింది. ఇక నటీనటుల విషయంలో కూడా క్రిష్‌ చూపిస్తున్న శ్రద్ద ఎంతో ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్‌లు ఆ పాత్రలకి 100శాతం సూటబుల్‌. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల నారా చంద్రబాబు నాయుడుగా నటిస్తోన్న దగ్గుబాటి రానా పోస్టర్‌, ఎన్టీఆర్‌, చంద్రబాబు భుజంపై చేయి వేసిన పోస్టర్‌తో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఎన్టీఆర్‌ సమకాలీనుడైన ఏయన్నార్‌ పాత్రకి కూడా 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎన్టీఆర్‌ పౌరాణిక పాత్రల ద్వారా అదరగొడుతున్న సమయంలో ఏయన్నార్‌ సాంఘిక చిత్రాల ద్వారా తన హవా చాటుకున్నాడు. వీరిద్దరి మధ్య ఎక్కడలేని విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ వీలున్నప్పుడల్లా వీరిద్దరు కలిసి నటిస్తూ ప్రేక్షకులను మల్టీస్టారర్స్‌ ద్వారా అలరించారు. ఇక నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రం యూనిట్‌ ఎన్టీఆర్‌ పాత్రధారి బాలకృష్ణతో ఏయన్నార్‌ పాత్రను చేస్తోన్న సుమంత్‌తో కలిసి ఉన్న స్టిల్‌ని విడుదల చేసింది. 

ఇందులో ఎన్టీఆర్‌కి, ఏయన్నార్‌ సిగరెట్‌ వెలిగిస్తూ ఉన్నాడు. ఈ పోస్టర్‌కి తోడుగా ఎన్టీఆర్‌కి సిగరెట్‌ వెలిగిస్తోన్న ఏయన్నార్‌కి సంబంధించిన ఒరిజినల్‌ ఫొటోని కూడా విడుదల చేశారు. ఈ ఫొటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఏయన్నార్‌గా సుమంత్‌లు ఎంతబాగా కుదిరారో అన్న టాక్‌ సర్వత్రా వినిపిస్తోంది. మొత్తానికి పలువురు ప్రముఖుల లుక్‌లతో రోజురోజుకి 'ఎన్టీఆర్‌' బయోపిక్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

NTR and ANR Photos Sensation in Social Media:

NTR Movie ANR Pic Sensation in internet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs