Advertisement
Google Ads BL

‘నన్ను దోచుకుందువటే’కి ఇది కలిసొస్తుందా?


నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ బాబు హీరోగా, నిర్మాతగా కొత్త దర్శకుడు నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నన్ను దోచుకుందువటే సినిమా ఈ వారం మూడు నాలుగు సినిమాలతో పోటీ పడింది. కోలీవుడ్ నుండి సామి2 చిత్రం ఒకటి తెలుగులో డబ్బింగ్ కాగా... ఈమాయ పేరేమిటో, సీనియర్ హీరో అర్జున్ నటించిన కురుక్షేత్రం సినిమాలు ఈ నన్ను దోచుకుందువటే సినిమాకి పోటీగా దిగాయి. అయితే సుధీర్ బాబు - నభా నటేష్ జంటగా వచ్చిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ ప్రేక్షకుల నుండే కాదు క్రిటిక్స్ నుండి వచ్చింది. ఈ సినిమాలో సుధీర్ బాబు, నభా నటేష్ నటన బావున్నప్పటికీ.. సినిమాలో మ్యూజిక్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేదు. అలాగే ఎడిటింగ్, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ సాగదీత, ప్రీ క్లైమాక్స్ వలన సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది.

Advertisement
CJ Advs

ఇక దర్శకుడి పనితనం, తీసుకున్న స్టోరీ లైన్, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ కామెడీ, నభా నటేష్ స్క్రీన్ ప్రెజెన్స్, సుధీర్ బాబు లుక్స్, నటన బావున్నాయనే టాక్ ప్రేక్షకుడు ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ గనుక సెకండ్ హాఫ్ లోను కంటిన్యూ అయితే సినిమా హిట్ అయ్యేదని.. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆసక్తి సెకండ్ హాఫ్ లో మందగించడం సినిమాకి మెయిన్ మైనస్ గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సుధీర్ బాబు సక్సెస్ అయ్యాడంటున్నారు. నిర్మాణ విలువలకి పేరు పెడతానికి లేదని... కాకపోతే ఈ వారం విడుదలైన విక్రమ్ సామి 2 , ఈమాయ పేరేమిటో, కురుక్షేత్రం చిత్రాల టాక్ బాగోకపోవడం సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేకి కలిసొస్తుందని అంటున్నారు.

విక్రమ్ - హరి - కీర్తి సురేష్ కాంబోలో వచ్చిన సామి సీక్వెల్ సామి 2 సినిమా హరి గత సినిమాలు సింగం పార్ట్ 1, 2, 3  సినిమాల కలయికగా ఉందని.. సినిమాలో పవర్ ఫుల్ నెస్ ఉన్నప్పటికీ... మరీ యాక్షన్ ఎక్కువైందని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ నటన ఈచిత్రానికి హైలైట్ గా నిలిచిందని.. కీర్తి సురేష్ తన నటనతో మెప్పించిన.... కీర్తి సురేష్ లుక్స్ కూడా ఏమంత బావుండలేదని.. అంటున్నారు. సీక్వెల్ తీయడంలో దిట్టయిన దర్శకుడు హరి ఈసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడనే టాక్ వినబడుతుంది.  ఇక కథ లేనప్పుడైనా కథనంతో నైనా దాన్ని కవర్ చేయాలి కానీ ఈ సామి 2 సినిమాకు అదికూడా వర్క్ అవుట్ కాలేదు కాబట్టే ఈ సినిమా రొటీన్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయిందంటున్నారు.

ఇక అర్జున్ నటించిన కురుక్షేత్రం, ఈ మాయ పేరేమిటో చిత్రాలు అస్సలు అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు రావడం కాస్త నన్ను దోచుకుందువటే సినిమాకి కలిసొచ్చేలా కనబడుతుంది. కురుక్షేత్రం, ఈమాయ పేరిమిటో సినిమాలు కూడా ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. మరి ఈ మూడు సినిమాల టాక్ సుధీర్ బాబు కి కలిసొచ్చేలా కనబడుతుంది. చూద్దాం సుధీర్ బాబు నిర్మాతగా ఈ సినిమాకి ఎలాంటి లాభాలు వెనకేసుకుంటాడో అనేది. అన్నట్టు సుధీర్ గత చిత్రం సమ్మోహనం హిట్ .. కానీ కలెక్షన్స్ మాత్రం అంతంతమాత్రంగా వున్నాయి. మరి నన్ను దోచుకుందువటే టాక్ బాగోకపోయినా.. కలెక్షన్స్ బావుంటాయేమో చూద్దాం.

Lucky chance to Nannu dochukunduvate:

Excellent Timing to Sudheer Babu Nannu dochukunduvate
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs