Advertisement
Google Ads BL

మరో కన్నడ బ్యూటీ.. దోచేసుకుంది..!


నిన్న శుక్రవారం విడుదలైన నన్ను దోచుకుందువటే సినిమా మంచి టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. సుధీర్ బాబు తన ఓన్ ప్రొడక్షన్ లో హీరోగా ఆర్.ఎస్. నాయుడు అనే కొత్త డైరెక్టర్ తో ఈ నన్ను దోచుకుందువటే సినిమాని నిర్మించాడు. మరి ఈ సినిమాకి మొదటి షోకే ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి మంచి మార్కులే వేయించుకుంటోంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కామెడీతో అదరగొట్టేస్తుండగా...సెకండ్ హాఫ్ కాస్త సాగదీతగా ఫీల్ అవడం వలెనే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నటేష్ అనే కన్నడ భామ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. నభా నటేష్ మాత్రం టాలీవుడ్ మొదటి సినిమాకే చక్కని పాత్ర దక్కించుకుంది. మేఘన కమ్ సిరి పాత్రలో నభా నటేష్ చెలరేగిపోయింది. అచ్చం బొమ్మరిల్లులో హాసిని తరహాలో అనిపించే సిరిగా చక్కగా ఒదిగిపోయింది. గ్లామర్ పరంగా కొన్ని మైనస్ లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పెరఫార్మన్స్ బేస్డ్ పాత్రలు అయితేనే తనకు బాగా సూట్ అవుతాయి. గొప్ప అందగత్తె కాదు కానీ ఆకట్టుకునే లక్షణం ఉంది. అందమైన చూపులతో... ఆకర్షణీయమైన దేహంతో నభా నటేష్ ఆకట్టుకుంది. 

Advertisement
CJ Advs

దర్శకుడు సిరి పాత్రను తీర్చిదిద్దిన తీరుకి సెలెక్ట్ చేసుకున్న నభా నటేష్ బాగా సింక్ అయ్యింది. ఇక మేఘన కన్నా సిరి పాత్రలోనే నభా నటేష్ బాగా హైలెట్ అయ్యింది. నభా నటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కి మంచి మార్కులే పడుతున్నాయి. పాత్ర కూడా బాగుండటంతో నభా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేస్తుంది. అసలు హీరోయిన్ నభా నటేష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులోకి మరో కన్నడ భామ డీసెంట్ ఎంట్రీ... మిగతా భామలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటికే ఛలో సినిమాతో మరో కన్నడ భామ రష్మిక మందన్న మిగతా తెలుగు హీరోయిన్స్ కి చుక్కలు చూపెడుతుంది. తాజాగా నభా నటేష్ కి కూడా ఈ సినిమాతో మరిన్ని తెలుగు అవకాశాలు వచ్చినా రావచ్చు. మరి కొంతందాలను  ఊరికే ఎవరు వదలరు కదా.. అందులోను పర భాషా హీరోయిన్స్ మీదున్న మోజు మామూలుది కాదాయే...!

One More Beauty Enters Tollywood with Nannu Dochukunduvate:

Praises on Nabha Natesh acting in Nannu Dochukunduvate
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs