Advertisement
Google Ads BL

వెన్నెల కిషోర్.. టైమ్ అయిపోయినట్లేనా..?


ఈ మధ్యన కమెడియన్ బ్రహ్మానందం తర్వాత వెన్నెల కిషోర్ అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. సునీల్ హీరోగా సినిమాలు చేయడంతో టాలీవుడ్ కి మళ్ళీ బ్రహ్మి తర్వాత సరైన కమెడియన్ లేకపోయాడు. చిన్న చితక కమెడియన్స్ వస్తున్నప్పటికి... ఒక సినిమాలో కనబడిన కమెడియన్ మరో సినిమాలో కనబడటం లేదు. అయితే బ్రహ్మానందం కామెడీని తెలుగు ప్రేక్షకులు కాస్త వెగటుగా ఫీల్ అవడంతో... బ్రహ్మి కామెడీ ఏ సినిమాలోనూ వర్కౌట్ అవ్వడం లేదు. అసలు తాజాగా బ్రహ్మానందం నటించిన సినిమాలన్నీ ప్లాప్స్.. అవడంతో బ్రహ్మికి ఛాన్స్ లే రావడం లేదు. అయితే ఈ గ్యాప్ లో వెన్నెల కిషోర్ అనూహ్యంగా ఫామ్‌లోకొచ్చేశాడు. ఆనందో బ్రహ్మ వంటి సినిమాల్లో వెన్నెల కామెడీ కాస్త సక్సెస్ అవడంతో... అందరూ వెన్నెల కిషోర్ చుట్టూ చేరారు. వెన్నెల జోరు ఎలా వుంది అంటే... స్టార్ హీరోల సినిమాల్లోనూ వెన్నెల కామెడీనే దర్శక నిర్మాతలు కోరుకోవడంతో... అనేక సినిమాలకు సైన్ చేసి ఫుల్ బిజీగా మారాడు.

Advertisement
CJ Advs

ఇక నాగ చైతన్య - మారుతీ లాంటి వాళ్లయితే వెన్నెల కిషోర్ డేట్స్ సర్దుబాటు అయ్యేవరకు శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్ ని ఆపారంటే.. అప్పట్లో వెన్నెల కిషోర్ డిమాండ్ అలా వుంది. కానీ గత రెండు సినిమాల నుండి వెన్నెల కిషోర్ కామెడీ సినిమాల్లో పెద్దగా వర్క్అవుట్ అయినట్లుగా కనబడ్డం లేదు. గీత గోవిందంలో వెన్నెల కిషోర్ పెళ్లి కోసం విదేశాల నుండి వచ్చి విజయ్ కి రష్మికకు పెళ్లి చెయ్యడం కోసమే కాసేపు కామెడీ అవతారం ఎత్తినట్టుగా కనిపించింది. ఇక అందులో వెన్నెల చేసిన కామెడీ పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇక తాజాగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాలోనూ వెన్నెల కామెడీని ఎవ్వరూ పొగడడం లేదు. వెన్నెల కిషోర్ కామెడీ శైలజా రెడ్డిలో అస్సలు బాగోలేదని క్రిటిక్స్ తో పాటుగా ప్రేక్షకులు అన్నారు. మరి ఒకటి రెండు సినిమాలకే వెన్నెల కామెడీ మొహం మొత్తుతుంటే... ఇక వెన్నెల కిషోర్ కామెడీని నమ్ముకుని ఆయనకి అవకాశాలెవరిస్తారు. 

ఎంత ఫాస్ట్ గా లైం టైంలో కొచ్చాడో... అంతే ఫాస్ట్ గా కెరీర్ లో డ్రాప్ అవుతున్నట్లుగా వెన్నెల పరిస్థితి చూస్తుంటే అర్ధమవుతుంది. మరి వెన్నెల ఇదేమాదిరి కామెడీ చేస్తే అతని ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇక కనీసం గీత గోవిందం మాదిరి శైలజా రెడ్డి అల్లుడు హిట్ అయినా వెన్నెలకి కాస్త ఊరట లభించేది. కానీ సినిమాకి యావరేజ్ టాక్ పడడంతో ఆ సినిమాలో నటించిన వెన్నెల కిషోర్ ని కూడా క్రిటిక్స్ వదల్లేదు. మరి వెన్నెల డ్రాప్ సునీల్ కి కలిసొస్తుందేమో.... ఎందుకంటే హీరోగా ఉన్న సునీల్ ఇప్పుడు మళ్ళీ కమెడియన్ గా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంటోని సినిమాల్లో సునీల్ కామెడీ హైలెట్ అంటూ ప్రచారం మొదలైంది. ఇక సునీల్ కానీ మళ్ళీ ఫామ్ లోకొచ్చాడా.. వెన్నెల పని అవుట్.

Negative Comments Started on Vennela Kishore Comedy:

Vennela Kishore Time not Working at box office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs