Advertisement
Google Ads BL

మల్టీస్టారర్ చేస్తే నానితోనే చేయాలి: నాగ్


అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా.. ఆకాంక్ష సింగ్ , రష్మిక మందన్నా హీరోయిన్స్ గా వస్తున్న తాజా చిత్రం ‘దేవదాస్’. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందించారు. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగ అశ్విన్, వంశీ పైడిపల్లి, క్రిష్, టి.సుబ్బిరామిరెడ్డి, సమంతలు హాజరయ్యారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ.. అశ్విని దత్ గారు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసి ఇరవై ఏళ్ళు అవుతుంది.. ఇప్పటికీ నన్ను భరించి సినిమాలు ఇస్తున్నందుకు దత్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. డైరెక్టర్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతనికి ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. అన్నారు.. 

సమంత మాట్లాడుతూ.. ఈ సినిమాలో మా మామయ్య చంపేశారు.. ఇంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ సినిమాకి రావడం ఆనందంగా ఉంది.. నాని సినిమా అంటే స్పెషల్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా నాని మార్క్ ఉంటుంది. వైజయంతి మూవీస్‌కి కంగ్రాట్స్. ఈ సినిమా గొప్ప హిట్ అందుకుంటుందని అనుకుంటున్నాను.. అన్నారు. 

దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా గ్రాండ్ గా వైజయంతి మూవీస్ చేస్తున్న సినిమా ఇది. మహానటి సినిమా చేస్తున్నపుడు ఈ సినిమా గురించి చెప్పేవారు అప్పుడే సినిమా బాగా వస్తుంది సూపర్ హిట్ అన్నా. నాని మంచి హార్డ్ వర్కర్. అయన సినిమా హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. శ్రీ రామ్ ఒక్కో సినిమాతో మంచి హిట్ కొడుతున్నాడు. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాడు.. అన్నారు.  

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ముందుగా నాగేశ్వరరావు జయంతి రోజున ఈ సినిమా ఫంక్షన్ జరగడం చాలా బాగుంది. నాగార్జున గారితో సినిమా చేయడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. చాలా హ్యాపీగా ఉంటుంది. మహానటితో హిట్ కొట్టిన వైజయంతి మూవీస్ ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టబోతుంది.. అన్నారు. 

నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు గారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. నా అభిమాన హీరో నాగార్జున, నా మంచి మిత్రుడు నాని కలయికలో శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య లాంటి యంగ్ డైరెక్టర్లు తెలుగు సినీ పరిశ్రమకి రావడం మంచి పరిణామం..అన్నారు.

హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వైజయంతి సినిమా చేశాను అంటే నమ్మలేకపోతున్నాను. ఇంత గొప్ప బ్యానర్ లో పనిచేయడం ఆనందంగా ఉంది. నాగార్జున గారితో, నాని గారితో నా మూడో సినిమాలోనే పనిచేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్.. అన్నారు. 

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చూసిన తర్వాత ఏం చెప్పాలో అర్థకావట్లేదు. నాగార్జున గారితో, నానితో, రష్మికతో నేను యాక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా రిలీజ్ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.. ఈ సినిమాలో నన్ను తీసుకున్నందుకు అశ్వినీదత్ గారికి థ్యాంక్స్..అన్నారు.

దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య మాట్లాడుతూ.. వైజయంతి మూవీస్‌లో పనిచేయడం చాలా గర్వంగా ఉంది.. అశ్వినీదత్ గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సర్. నాగార్జునగారితో పనిచేయడం ఒక గొప్ప అవకాశం.. అయన సెట్ లో ఉన్నారంటేనే నాకు థ్రిల్ గా అనిపిస్తుంది. ఆయనతో సినిమా చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. నా లేజీనెస్‌ని భరించినందుకు అందరికి థ్యాంక్స్. నాని డైరెక్టర్స్ హీరో. డైరెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే హీరో. సినిమా మొదటినుంచి నాతో పనిచేసి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు అందరికి నా ధన్యవాదాలు అన్నారు.

హీరో అఖిల్ మాట్లాడుతూ.. ఒక సినిమా హిట్ కాబోతుందని ముందే తెలియడానికి ఒక వైబ్ వస్తుంది. అలాంటి వైబ్ ఈ సినిమాకి నాకు కనిపిస్తుంది. నాన్న, నాని కలిసి పెద్ద హిట్ కొట్టబోతున్నారనిపిస్తుంది. నాని అంటే చాలా ఇష్టం. నానికి పెద్ద ఫ్యాన్.. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఆల్ ద బెస్ట్.. అన్నారు.

నాని మాట్లాడుతూ.. నాగార్జున గారు ఇంత అందంగా ఉండడానికి కారణం అయన తినేవో, తాగేవో కాదని ఈ సినిమా షూటింగ్ లో అర్థమయ్యింది. అయన అందానికి కారణం అయన హ్యాపీనెస్.. ఎప్పుడు హ్యాపీగా ఉండడం వల్లనే అయన అలా ఉన్నారు. దేవదాస్ చాలా బాగా వచ్చిందని నాగ్ సర్ చెప్పగానే హిట్ కొట్టినంత హ్యాపీగా  ఫీల్ అయ్యాను. రష్మికతో పనిచేయడం హ్యాపీగా ఉంది. ఆకాంక్ష గారితో పనిచేయడం ఎంతో ఎంజాయ్ గా ఉంది. దత్ గారితో పనిచేయడం గర్వంగా ఉంది. వైజయంతి మూవీస్ లో పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేనిది. అశ్వినీదత్  గారి డెడికేషన్ మాములుగా లేదు. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. శ్రీరామ్ టీంలో అందరికంటే చాలా చిన్నోడు. ఇంత పెద్ద సినిమాని భుజాల మీద మోసి రిలీజ్ చేస్తున్నాడు అంటే అప్పటికే సినిమా హిట్ అని అర్థమవుతుంది. మణిశర్మగారికి నేను చాలా పెద్ద అభిమానిని. అయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.. అన్నారు.

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఈరోజు (సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు.1953 లో దేవదాస్ సినిమా రిలీజ్ అయ్యింది. మళ్ళీ దేవదాస్ సినిమా రిలీజ్ కాబోతుంది. అదొక్కటి చాలు ఏఎన్నార్ లిప్స్ ఆన్ అనడానికి. అందరూ అన్నట్లు సినిమాకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం మొదటిది స్క్రిప్ట్. రెండోది వైజయంతి మూవీస్, మూడోది నాని.. స్క్రిప్ట్ వినగానే నాని నా అపోజిట్ రోల్ అనగానే సూపర్ అనిపించింది. అశ్వినీదత్ గారి గురించి అందరికి తెలుసు. ఆయనేంటో, సినిమాపై ఆయనకున్న ప్రేమ ఎలాంటిదో అయన సినిమాలే చెప్తున్నాయి. సినిమా కోసం ఏదైనా చేసే మనస్తత్వం ఆయనది. మల్టీస్టారర్ చేస్తే నానితో చేయాలనిపించేది. అది ఈ సినిమాతో నిజమైంది. నాని సూపర్ యాక్టర్.  ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్. రష్మిక మంచి ఎంటర్టైన్ పర్సన్. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. ఆకాంక్ష చాలా రోజుల తరువాత ఒక అందమైన అమ్మాయితో యాక్ట్ చేసాను.. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. శ్రీరామ్ ఆదిత్య... ఇంత చిన్న వయసులో ఇంత మందిని డీల్ చేశాడు. ఫ్యూచర్లో గొప్ప డైరెక్టర్ అవుతాడు.. అన్నారు.

Devadas Music Party Event Highlights :

Celebrities Speech at Devadas Music Party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs