Advertisement
Google Ads BL

నయన్ విషయంలో విఘ్నేష్ భలే ట్విస్టిచ్చాడు


నయనతార కెరీర్‌ ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్‌లో సాగుతోంది. దక్షిణాది సూపర్‌స్టార్‌గా ఈమె అనుష్క వంటి వారిని కూడా పక్కకు నెట్టి హీరోలకు సరి సమానమైన ఇమేజ్‌ని సాధించుకుంది. ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు స్టార్‌ హీరోల చిత్రాల ఓపెనింగ్స్‌, కలెక్షన్లకు ధీటుగా ఉంటున్నాయి. విజయశాంతి తర్వాత ఆ స్థాయిలో లేడీ సూపర్‌స్టార్‌ బిరుదు పొందిన నటిగా బహుశా ఈమెనే చెప్పుకోవాలేమో. ఈమెతో నటించాలని సీనియర్‌ స్టార్స్‌ నుంచి అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ అవుతున్న వారు కూడా నయనే హీరోయిన్‌గా కావాలని పట్టుబడుతున్నారు. కానీ నయన మాత్రం హీరోలతో చెట్టుపుట్టల వెంట షికారు కొట్టే పాత్రలకు సున్నితంగా నో చెబుతోంది. ఈ విషయం ఆమె బాలకృష్ణ సరసన నటించిన 'జైసింహా' చిత్రంతో మరింత స్పష్టం అయింది. ఈ చిత్రంలో బాలయ్యను చేతితో కూడా టచ్‌ చేసే సీన్లు లేకపోవడం విశేషం. 

Advertisement
CJ Advs

ఇక చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి'లో ఆమె ఎంతో అద్భుతమైన పాత్రను చేస్తోందని, ఇది కేవలం రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలా ఉండదని తెలుస్తోంది. మరి ఇలాంటి పీక్‌ స్టేజీలో ఆమె పెళ్లి చేసుకుని ముందుకు వెళ్తుందా? లేక కెరీర్‌ కోసం వివాహాన్ని మరికొంత కాలం పక్కన పెడుతుందా? అనేది వేచి చూడాల్సివుంది. అయితే ఈమె గానీ, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ గానీ డైరెక్ట్‌గా తమ ప్రేమాయణం గురించి నేరుగా చెప్పకపోయినా వీరి మధ్య సమ్‌థింగ్‌..సమ్‌థింగ్‌ నడుస్తోందన్న విషయాన్ని మాత్రం వారు ఇన్‌డైరెక్ట్‌గా వారు పోస్ట్‌ చేసే ఫొటోల ద్వారా బహిరంగ విషయంగా అర్ధమవుతూనే ఉంది. 

ఇక తాజాగా విఘ్నేశ్‌ శివన్‌, నయనతారకు పంజాబ్‌ అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఫొటోలు దిగి పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక తాజాగా విఘ్నేశ్‌శివన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నయనతారతో పెళ్లి విషయమై స్పందించాడు. నయనతో పెళ్లి విషయం నాకు తెలియదు. నాకు తెలిస్తే మీకు చెబుతా...ముందు నయనను తర్వాత మా అమ్మని అడిగి ఆ తర్వాత చెబుతాను అంటూ సమాధానాన్ని తెలివిగా దాటవేశాడు. 

Marriage with Nayanthara? Vignesh Shivan opens up:

Vignesh Shivan Comments on Marriage With Nayanthara Raises New Doubts 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs