Advertisement
Google Ads BL

అదే జరిగితే ‘బిగ్‌బాస్2’ టీఆర్పీ పెరగడం ఖాయం!


నిన్నమొన్నటివరకు బిగ్ బాస్ సీజన్ టు నాని హోస్టింగ్ పై, హౌస్ కంటెస్టెంట్స్ పై పెద్దగా జనాలలో ఆసక్తి లేకుండా పోయింది. బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా హిట్ అయిన బిగ్ బాస్ షో.. నాని రాకతో కాస్త డల్ అయ్యింది. మొదటి సీజన్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిన ఎన్టీఆర్ రెండో సీజన్ కి డేట్స్ సర్దుబాటు లేవంటూ బిగ్ బాస్ టీం కి హ్యాండిచ్చాడు. నిన్నమొన్నటివరకు బిగ్ బాస్ సీజన్ టు పై పెద్దగా ఆసక్తి లేదుకానీ.. ఇపుడు బయట కౌశల్ ఆర్మీ పేరిట జరుగుతున్నా 2 కే  రన్ లు, ర్యాలీలు హంగామా సృష్టిస్తుంటే... లోపల అదేనండి బిగ్ బాస్ హౌస్ లో ధర్నా జరుగుతుంది. హౌస్ లోని సభ్యులంతా కౌశల్ ని టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కూడా కౌశల్ ని బ్యాడ్ చేసే ప్రయత్నాలేవో మొదలెట్టినట్టుగా టాక్ ఉండనే ఉంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం 101 రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మరో పది రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. అయితే సీజన్ వన్ గ్రాండ్ ఫినాలే ని ఎన్టీఆర్ ఎంతో చక్కగా అందరూ ఆకట్టుకునేలా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈసారి నాని స్టామినా చాలదని స్టార్ మా యాజమాన్యం నాని కి తోడుగా బిగ్ బాస్ సీజన్ టు కి స్పెషల్ గెస్ట్ గా ఒకరిని తీసుకురాబోతున్నట్టుగా వారాలొస్తున్నాయి. అయితే మొదట్లో ఎన్టీఆర్ పేరు వినబడినప్పటికీ... ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్, హరికృష్ణ మరణంతో కుంగిపోవడంతో.. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనలేకి రాడని అన్నారు. ఈ లోపు నాగార్జున పేరు తెర మీదకి రావడం జరిగింది. నాని, నాగార్జున కలిసి దేవదాస్ ని ప్రమోట్ చేస్తూ గ్రాండ్ ఫినాలేని పూర్తి చేస్తారని, నాగార్జున కి స్టార్ మా కి ఉన్న అనుబంధంతో నాగ్ ఫైనల్ ఈవెంట్ కి వస్తున్నాడన్నారు.

కానీ తాజాగా మళ్ళీ ఎన్టీఆర్ ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హాజరవుతున్నాడని.. బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రేక్షకులను, మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్ ని ఎంటర్టైన్ చేస్తూ.. ఫైనల్ విన్నర్ ని ఎన్టీఆర్ ప్రకటిస్తాడంటూ.. లేటెస్ట్ గా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హాజరవుతాడని వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియదు గాని... నిన్నటినుండి సోషల్, వెబ్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ కి వచ్చే విషయమై వచ్చిన వార్తలు నిజమే అని... అధికారిక ప్రకటన రావడమే తరువాయంటున్నారు కొంతమంది. ఏది ఏమైనా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఎన్టీఆర్ గనక హాజరయితే.. స్టార్ మా టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్ లో పెరగడం ఖాయం.

Bigg Boss Takes Sensational Decisions For Finale:

Jr NTR Chief Guest for Bigg boss 2 Finale
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs