Advertisement
Google Ads BL

విజయ్.. ఎవరీ అమ్మాయ్..?


టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అనగానే అంతా ప్రభాస్ పేరు చెబుతారు. అదే కోవలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. మరి ప్రభాస్ అంత కాకపోయినా లేట్ గా వచ్చి వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇతనికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మంది చాలా సార్లు లవ్ మ్యారేజా.. ఏరేంజ్ మ్యారేజా అంటూ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే విజయ్ మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు. కానీ గత కొన్ని రోజులు నుండి తన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement
CJ Advs

రీసెంట్ గా అతనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతుండటంతో ఆ అనుమానాలు రాక మానవు. విజయ్ తో చాలా క్లోజ్‌గా ఉన్నట్టు ఉన్న ఆ అమ్మాయి పేరు విర్జినీ. ఆమె బెల్జియం లో ఉంటుంది. ‘పెళ్లి చూపులు’ సినిమాలో ఓ సీన్ లో కూడా యాక్ట్ చేసింది. అప్పటినుండి విజయ్ తో పాటు విజయ్ ఫ్యామిలీ తో కూడా చాలా అనుబంధం ఏర్పరుచుకున్న విర్జినితో విజయ్ కు ఎటువంటి బంధం అనే దాని గురించి వార్తలు వస్తున్నాయి. తన ఫ్రెండ్ అని..లవర్ అని..ఫ్యామిలీ ఫ్రెండ్ అని రకరకాలుగా అనుకుంటున్నారు. విజయ్ తో అతని ఫ్యామిలీతో ఉన్న ఫొటోస్ ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ షేర్ చేయడంతో అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి

అయితే ఇంత జరుగుతున్న విజయ్ మాత్రం నోరు విప్పడంలేదు. ఆయన ఏం అంటాడో అని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఆయన నోరు విప్పి సమాధానం ఎప్పుడు చెబుతాడో చూడాలి. ప్రస్తుతం విజయ్ ‘నోటా’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇంకా సెట్స్ మీద ‘డియర్ కామ్రేడ్’ ఉంది. వీటితో పాటు కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. మరి విజయ్ మీద వస్తున్న ఈ వార్తలకి ఎప్పుడు బ్రేక్ పడుతుందో..?

Vijay Deverakonda and Virgini Photo viral in Social Media:

Doubts on Vijay Deverakonda Photo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs