Advertisement
Google Ads BL

విక్రమ్‌ ఎమోషన్‌తో హ్యాపీ: ‘సామి’ నిర్మాత


విక్రమ్‌గారి ఆ ఎమోషన్‌తో చాలా హ్యాపీగా ఫీలయ్యాం: ‘సామి’ నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

Advertisement
CJ Advs

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడదే టైటిల్‌తో తెలుగులో రాబోతోన్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలతో పాటు క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ..‘‘సామి చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 21న భారీగా థియేటర్లలోకి సామి రాబోతున్నాడు. ఇంతకు ముందు మా సినిమాపై ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ సినిమా సెన్సార్ కాదు. రిలీజ్ కాదు అని కొందరు రూమర్లు క్రియేట్ చేశారు. అన్ని రూమర్లను అధిగమించి సెన్సార్ పూర్తి చేసుకున్నాడు సామి. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో పాటు క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందిన ‘సామి’ చిత్రాన్ని సుమారు 600 నుంచి 700 థియేటర్లలో సెప్టెంబర్ 21న విడుదల చేస్తున్నాము. ఈ సినిమా రిలీజ్‌కు కోపరేట్ చేసిన ఎగ్జిబిటర్స్‌కు, అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ అయ్యేలా ఎంకరేజ్ చేసిన నిర్మాతలకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు హరిగారు. ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమా 2గంటల 34 నిమిషాలు ఉంటుంది. ఆయన సినిమాలు ఎంత స్పీడుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఉదాహరణగా ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాని విక్రమ్‌గారు ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూశారు. చూసిన వెంటనే విక్రమ్ గారు ఎమోషనలై.. హరిగారి ఇంటికి వెళ్లి హగ్ చేసుకున్నారట. ‘‘నా కెరియర్‌లో అపరిచితుడు చిత్రం తర్వాత బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవుతుంది. నాకు మైల్‌స్టోన్ మూవీ ఇచ్చారు..’’ అంటూ ఎమోషనల్ అయ్యారట. ఈ విషయం తెలిసి మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఇప్పటికే రిపోర్ట్స్ నుంచి ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ కాబోతోందనే టాక్ వచ్చేసింది. ఇందులో తెలుగుతనం ఉట్టిపడేలా హరిగారు జాగ్రత్తలు తీసుకున్నారు. సెన్సార్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. మంచి సినిమా. ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు అంటూ క్లీన్ యు సర్టిఫికెట్‌ను వారు జారీ చేశారు. 

సింగం సిరీస్‌లో లాస్ట్ చిత్రంకి హరిగారు కాస్త డిజప్పాయింట్ అయినట్లున్నారు. అందుకే ఈ సినిమాలో విక్రమ్‌గారిని పోలీసు పాత్రలో ఆయన తరహాలో అదిరిపోయేలా ఆ సిరీస్ కంటిన్యూ అనేలా తీర్చిదిద్దారు. మదర్ సెంటిమెంట్, పవర్ ఫుల్ మాస్ యాక్షన్, రాక్ స్టార్ దేవిశ్రీగారి సాంగ్స్, ఆర్ఆర్.. ఇలా అన్నీ హై క్వాలిటీ వేల్యూస్‌తో సెప్టెంబర్ 21న సామి వస్తున్నాడు. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను..’’ అని తెలిపారు.

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్, ఎడిటర్: వి. టి. విజయన్, టి ఎస్. జయ్, కథ-డైరెక్షన్: హరి, నిర్మాతలు: బెల్లం రామకృష్ణ రెడ్డి, కావ్య వేణు గోపాల్.

Happy with Vikram’s that Emotion: Saamy Producer:

Bellam Ramakrishna Reddy Interview about Saamy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs