శంకర్ - రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన రోబో సీక్వెల్ 2.ఓ సినిమా ఎట్టకేలకు నవంబర్ 29 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం పబ్లిసిటీ కార్యక్రమాలను స్టార్ట్ చేసారు 2.ఓ నిర్మాతలు. గత ఏడాదే 2.ఓ పాటలను విడుదల చేసిన 2.ఓ టీం తాజాగా టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ హాలీవుడ్ మూవీస్ తో పోటీ పడింది. భారీ అంచనాలున్న 2.ఓ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడడంతో.. సినిమా మీద క్రేజ్ తగ్గిందనే భావన 2.ఓ సినిమా టీజర్‌తో పటాపంచలైపోయాయి. అయితే టీజర్ లో కానీ.. ఏ విషయంలో కానీ 2.ఓ కథ ఏమిటనేది మాత్రం రివీల్ అయ్యి అవ్వనట్లే కనబడింది. కానీ ప్రపంచంలో సెల్ ఫోన్స్ అన్నిటిని కొట్టేసి ప్రపంచాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఒక పక్షిగా అక్షయ్ కుమార్ ట్రై చేస్తున్నట్టుగా టీజర్ లో అర్ధమయ్యింది.
అయితే తాజాగా 2.ఓ కథ అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ వైరల్ అయ్యింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తూన్న ఒక సమస్య. గ్లోబల్ వార్మింగ్, రేడియేషన్. సెల్ ఫోన్స్ వినియోగం వలన రేడియేషన్ పెరిగిపోయి.. వినియోగం విపరీతంగా పెరిగిపోయి వాటి వల్ల కలిగే నష్టాలూ, సమస్యలు... అలాగే.. దీనివల్లే పక్షి జాతి అంతరించిపోతుంది అని పక్షి పాత్ర చేస్తున్న విలన్ అక్షయ్ కుమార్ భావించి మనుషుల మీద, సెల్ ఫోన్స్ ని లాక్కుని వారిపై పోరాటానికి దిగితే.. రోబో సినిమాలో చిట్టి రోబో వలన మానవ మనుగడకే నష్టం వాటిల్లుతుందని.. చిట్టిని రజినీకాంత్ నాశనం చేసి పడెయ్యడంతో.. రోబో సినిమాకి ఎండ్ కార్డు పడింది. అయితే 2.ఓ లో అక్షయ్ కుమార్ తో పోరాటం చెయ్యడానికి అదే చిట్టిని రజిని మళ్లీ తీసుకురావడం.. పక్షిరాజు, సెల్ ఫోన్లు, చిట్టి మధ్యనే ఈ కథ ఉండబోతున్నట్టుగా ప్రచారమైతే జోరుగా జరుగుతుంది.
మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ సినిమాలో కథ ఇదే అని.. ఇంకా సినిమాలో విజువల్ వండర్స్ గ్రాఫిక్స్ మాయాజాలం ప్రేక్షకుడిని ఒక మాయ ప్రపంచంలోకి తీసుకెళుతుందని.. అందుకే 2.ఓ గ్రాఫిక్స్ కి శంకర్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని అంటున్నారు. ఇకపోతే అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాకి 450 కోట్ల భారీ బడ్జెట్ పెట్టింది లైకా ప్రొడక్షన్.