Advertisement
Google Ads BL

ఇంకా ఫిదా అవుతూనే ఉన్నారు...!


మెగాహీరో వరుణ్‌తేజ్‌కి మొదటి కమర్షియల్‌ సక్సెస్‌ని అందించిన చిత్రం 'ఫిదా'. ఈ చిత్రంతో వరుణ్‌తేజ్‌ కంటే సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఫామ్‌ కోల్పోయాడని భావిస్తోన్న శేఖర్‌కమ్ముల ఈ చిత్రంతో మరలా ఫామ్‌లోకి వచ్చాడు. ఇక దిల్‌రాజుకి కూడా ఈ చిత్రం లాభాల వర్షం కురిపించింది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే 'ఫిదా' చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఓవర్‌సీస్‌లోనే భారీ విజయాన్ని కైవశం చేసుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాలలో ఒకటిగా నిలిచిందని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. అమెరికాలో పెరిగిన అబ్బాయిగా వరుణ్‌తేజ్‌, తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువతిగా సాయిపల్లవిలు ప్రేక్షకులను ఫిదా చేశారు. ఈ సినిమాలో 'వచ్చిండే పిల్లా మెల్ల మెల్లగా వచ్చిండే. క్రీమ్‌ బిస్కెట్‌ వేసిండే.. గమ్మున కూసోనియ్యాడే.. కుదురుగా నిల్సోనీయడే' పాట అద్భుతమైన రెస్సాన్స్‌ని సొంతం చేసుకుంది. ఈ విశేష జనాదరణ పొందిన ఈ గీతం ఇప్పటికీ పలు స్టేజీ షోలపైనా, ఫంక్షన్లలలో వినిపిస్తూనే ఉంటుంది. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఈ పాటను 15మిలియన్ల మంది అంటే 15కోట్ల మందికి పైగా వీక్షించారని, ఫేస్‌బుక్‌ ద్వారా దర్శకుడు శేఖర్‌కమ్ముల ఆనందం వ్యక్తం చేశాడు. 

150మిలియన్ల వీక్షకులను దాటిని తొలి తెలుగు పాట ఇదే. అద్భుతమైన స్పందనకు మీకు ధన్యవాదాలు.. ఈ మ్యాజిక్‌లో భాగమైన 'ఫిదా' టీంకి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అని శేఖర్‌కమ్ముల తెలిపాడు. ఓ మంచి మెలోడీ, మనదైన పాటకి ఎంతటి గుర్తింపు వస్తుందో 'రంగస్థలం'లోని 'రంగమ్మత్తా...', 'ఫిదా'లోని 'వచ్చిండే పిల్లా మెల్లమెల్లగా వచ్చిండే' పాటలకు లభిస్తున్న స్పందనే తెలియజేస్తోంది. 

Vachinde song from Fidaa clocks 150 million views:

Vachinde song from Fidaa creates record with 150 million views
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs