Advertisement
Google Ads BL

‘సైరా’ టీమ్ అక్కడ.. చిరంజీవి ఇక్కడ..?


రీసెంట్ గా హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సైరా టీం కొన్ని రోజులు కిందట యూనిట్ మొత్తం జార్జియా వెళ్లింది. అక్కడ కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అందుకుగాను సెట్స్ కూడా భారీగా వేశారట. యూనిట్ మొత్తం ఆ పనుల్లో బిజీ అయిపోయిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. అంతా బాగానే ఉందికాని ఆ యుద్ధం చేయాల్సిన హీరో ఎక్కడ? అదే మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉన్నారు?

Advertisement
CJ Advs

ఆయన ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు. యూనిట్ మొత్తం జార్జియాలో ఉంటే చిరంజీవికి ఇక్కడ ఏం పని అంటారా? ఆయన ప్రస్తుతం ఇక్కడ చిన్న సినిమాలను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం జార్జియాలో ఎటువంటి షూటింగ్ జరగడం లేదు. అక్కడ.. యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటేకర్ ఆధ్వర్యంలో యుద్ధ సన్నివేశాలకు సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నాయి అంతే. అంతా సెట్టయిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత చిరంజీవి ఇక్కడ నుండి అక్కడ వెళ్లనున్నారు. అది మ్యాటర్.

మరోపక్క జార్జియాలో తన తండ్రికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్పెషల్ కారవాన్ ను కూడా సిద్ధం చేసాడట చరణ్. అంతేకాదు చిరంజీవికి కావాల్సిన ఇండియన్ వంటకాల్ని సిద్ధం చేసేందుకు ఏకంగా ఆరుగురు చెఫ్ లను ఏర్పాటుచేస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. జార్జియాలో భారీ ఎత్తున అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశాలను తీయబోతున్నామంటూ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి ప్రకటించారు.

Sye Raa Team busy in Georgia:

Chiranjeevi promotes Small Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs