Advertisement
Google Ads BL

అర్ధరాత్రి అయినా బాలయ్య ఎనర్జీలో నో ఛేంజ్


బాలకృష్ణకి ఎంత వయసొచ్చినా అతనిలోని ఎనర్జీ కానీ, చిలిపితనం కానీ ఏమాత్రం తగ్గలేదు. ఈ వయసులోనూ చక చక సినిమాలు చేసేస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్న బాలకృష్ణ  ప్రైవేట్ పార్టీలలో బాగా ఎంజాయ్ చేస్తాడు. గతంలో బాలకృష్ణ, వెంకటేష్, చిరు వంటి వారు మోహన్ బాబు కొడుకు పెళ్ళిలో ఎంతెలా ఎంజాయ్ చేసి అల్లరి చేశారో తెలిసిందే. బాలకృష్ణకి కాస్త కోపం ఎక్కువనే గాని.. సినిమాల విషయంలో, పార్టీల విషయంలో అందరితో కలిసి అల్లరి చేస్తూ రెచ్చిపోతాడు. ఇక సినిమా సెట్స్ లోను బాలయ్య ఎనర్జీకి హీరోయిన్స్ కూడా ఆశ్చర్య పోతుంటారు. అయితే తాజాగా జరిగిన ఒక పార్టీలో బాలకృష్ణ  ఎనర్జీ లెవల్స్ కి హీరోయిన్స్ కొంతమంది నోళ్లెళ్ల బెట్టేశారట.

Advertisement
CJ Advs

తాజాగా బాలకృష్ణ సైమా అవార్డ్స్ కి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ అవార్డ్స్ ఫంక్షన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న బాలకృష్ణ ఆ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. కొంతమంది అయితే బాలకృష్ణ, క్రిష్ లు కలిసి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రీ అవార్డు అందుకోవడానికి వెళ్లారంటూ సెటైర్స్ వేశారు కానీ.. బాలయ్య వెళ్ళింది మాత్రం గౌతమీపుత్రకి అవార్డు అందుకోవడానికి. అయితే శ‌నివారం రాత్రి అవార్డు కార్య‌క్ర‌మం ముగిసిన వెంట‌నే దుబాయ్‌లో కొంతమంది స్టార్స్ తో మిడ్ నైట్ పార్టీ జ‌రిగింది. ఇక ఈ మిడ్ నైట్ పార్టీలో ద‌క్షిణాది నుంచి వ‌చ్చిన సెల‌బ్రెటీలంతా పాల్గొన్నారు. 

ఇక అవార్డ్స్ ఫంక్షన్ అంటే.. అది పూర్తయ్యేసరికి దాదాపు మిడ్ నైట్ అవుతుంది. ఇక ఆ ఫంక్షన్ అవ్వగానే దుభాయ్ లోని హోటల్ లో ఈ మిడ్ నైట్ పార్టీ రాత్రి 1 గంట‌ల‌కు మొద‌లై తెల్లవారి జామున 5 గంట‌ల వ‌ర‌కూ ఈ పార్టీ జ‌రుగుతూనే ఉందట. ఇక ఆ పార్టీ మొత్తానికి బాల‌య్యే సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారని... రాత్రంతా డాన్సులు చేస్తూ.. అక్క‌డి వాళ్ల‌ని ఎంటర్టైన్ చెయ్యడం దగ్గరనుండి.. అందరిని ఛిల్ల్ చేశాడట బాలయ్య బాబు. ఇక ఈ వయసులో బాలకృష్ణ అలా డాన్స్ స్టెప్పులతో చెలరేగిపోతే...  మిగిలిన హీరోయిన్లు, హీరోలూ ఊరుకుంటారా.. వారు బాలయ్య చుట్టూ చేరి స్టెప్పులేశారట. హీరోయిన్స్ అంజ‌లి, ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రియ వీళ్లంతా బాలకృష్ణ అల్ల‌రిలో పాలు పంచుకున్నారు. అర్థ‌రాత్రి దాటినా ఏమాత్రం త‌గ్గ‌ని బాల‌య్య ఎన‌ర్జీ చూసి.. అక్కడున్న సౌత్ స్టార్స్ మొత్తం ఆశ్చర్య పోయారట. మరి నిజంగానే బాలయ్య ఎనర్జీ లెవల్స్ పీక్స్ అనడానికి ఇదొక ఉదాహరణే.

Balakrishna Dance at Siima Special Party:

Siima.. Care of address to Balayya Energy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs