Advertisement
Google Ads BL

రేణు దేశాయ్‌ ఖుషీ జ్ఞాపకాలు..!!


పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో ఎ.యం.రత్నం నిర్మాతగా తమిళ దర్శకుడు ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో భూమిక హీరోయిన్‌గా నటించిన 'ఖుషీ' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం నుంచే పవన్‌కంటూ సొంత ఇమేజ్‌, మేనరిజమ్స్‌ బాగా వర్కౌట్‌ అయ్యాయి. అప్పటి వరకు ఉన్న రికార్డులను 'ఖుషీ' చిత్రం తిరగరాసింది. ఇక తాజాగా పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ 'ఖుషీ' చిత్రం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. 

Advertisement
CJ Advs

ఈ సినిమాలోని 'ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే' పాట నాటి యూత్‌కి విపరీతంగా నచ్చేసింది. ఈ పాటలో ఓ శునకం కనిపిస్తుంది. దాని పేరు బెల్‌. ఈ పాట చిత్రీకరణ న్యూజిలాండ్‌లో జరిగింది. ఈ పాటలో బెల్‌ కూడా కనిపిస్తుంది. బెల్‌ని చూసి యూనిట్‌లోని అందరు ఎంతో భయపడి పోయారు. నేను 'ఖుషీ' చిత్రానికి సహాయ దర్శకురాలిగా, సహాయక ప్రొడక్షన్‌ పర్సన్‌గా పనిచేశాను. అంతా బెల్‌ని చూసి భయపడుతూ ఉండటంతో నేనే స్వయంగా రెండు రోజులు బెల్‌ని చూసుకున్నాను. బెల్‌ చాలా మంచిది. దాంతో సరదాగా గడిపాం.. అని రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. 

అంతేకాదు.. తనతో బెల్‌ ఉన్న ఫొటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపరిచింది. ఇక రేణుదేశాయ్‌ మంచి జంతు ప్రేమికురాలు, ప్రకృతి ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఇక ఈమె పవన్‌ నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ, ప్రొడక్షన్‌ వ్యవహారాలలో పనిచేసి నేడు మరాఠీలో సొంతగా దర్శకత్వం, నిర్మాణం వంటివి చేస్తుండటం విశేషంగా చెప్పాలి. 

Renu Desai about Dog in Kushi Movie:

Renu Desai Remembered Kushi Memories
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs