Advertisement
Google Ads BL

సైమాకి చుక్కలు చూపిన హీరోయిన్లు!


హీరోయిన్స్ చాలామంది సినిమాల్లో హీరోయిన్స్ గా నటిస్తూనే.. మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్  సాంగ్స్ కి చిందేసి భారీగా పారితోషకాలు వెనకేసుకుంటారు. అంతేకాకుండా కొంతమంది హీరోయిన్స్ టాప్ రేంజ్ హీరోయిన్స్ అయినా సరే... అవార్డ్స్ ఫంక్షన్స్ కి కొన్ని స్పెషల్ ఈవెంట్స్ కి స్టేజ్ పెరఫార్మెన్సెస్ తో భారీగా దండుకుంటారు. ఐదు నిమిషాలకు ఇంత, 10 నిమిషాలకు ఇంత, పదిహేను నిమిషాలకు ఇంత అంటూ నిమిషాల్లో లక్షల, కోట్లు గడించే హీరోయిన్స్ కూడా ఉన్నారు. మరి లైవ్ పెరఫార్మెన్స్ చేసే టాప్ హీరోయిన్స్ కి నిర్వాహకులు భారీగానే ముట్టజెబుతుంటారు. ఇలాంటి వాటిలో సమంత, అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ కనబడరు కానీ.... రకుల్ ప్రీత్, శృతి హాసన్, తమన్నా వంటి హీరోయిన్స్ తో పాటుగా ఈమధ్యనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా విజయ్ అవార్డ్స్ వేదిక మీద చిందేసింది.

Advertisement
CJ Advs

మరి తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో కూడా అంజలి, ప్రగ్య జైస్వాల్, శ్రియ  వంటి హీరోయిన్స్ స్టేజ్ మీద డాన్స్ లతో కుమ్మేశారు. కానీ ఈ సైమాలో ఈసారి రకుల్, కాజల్, సమంత, అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ మాత్రం కనబడలేదు. రెడ్ కార్పెట్ మీద శ్రియ, హన్సిక, ప్రగ్య, షాలిని పాండే వంటి హీరోయిన్స్ సందడి చేశారు. కానీ శృతి హాసన్ వంటి హీరోయిన్స్ ఎక్కడా తారస పడలేదు. కారణం వారు ఈసారి సైమా అవార్డ్స్ కి దూరంగా వున్నారు. అందులోను శృతి హాసన్ అయితే తనకు సంబందించిన డీల్ సరిగా కుదరకపోవడంతోనే ఈ వేడుకకి డుమ్మా కొట్టడానికి కారణమనే టాక్ నడుస్తుంది. శృతిహాస‌న్‌ తో పాటుగా కాజ‌ల్‌, ర‌కుల్ లాంటి వాళ్ళు రాకపోవడానికి కూడా బేరం కుదరకపోవడమే కారణంగా చెబుతున్నారు.

శృతి హాసన్ సైమా స్టేజ్ మీద డాన్స్ పెరఫార్మెన్స్ తో పాటుగా.. కొన్ని పాట‌ల్ని స్వ‌యంగా పాడడానికిగాను దాదాపుగా 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని.. అది కూడా స్టేజ్ మీది 15 నిమిషాల సమయానికేనట. అయితే శృతి స్టేజ్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకున్న సైమా నిర్వాహకులు శృతి హాసన్ అడిగింది ఇవ్వడానికి రెడీ అయినప్పటికీ.. శృతి పర్సనల్ కారణాలతో.. ఈ అవార్డ్స్ వేడుకకి హాజరవలేదని తెలుస్తుంది. అలాగే రకుల్ ప్రీత్ అండ్ కాజల్ కూడా ఈ సైమా స్టేజ్ పెరఫార్మెన్స్ కి భారీగా డిమాండ్ చేశారని.. రకుల్ 40, కాజల్ 30 లక్షలు డిమాండ్ చేసినట్టుగా సమాచారం. మరి వారికీ సరిగ్గా డీల్ సెట్ కాక ఈ ప్రోగ్రామ్స్ కి డుమ్మా కొట్టారంటున్నారు. 

Heroines demands High Remuneration for Siima:

Kajal, Shruti and Rakul Demands High Salary for Siima Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs