Advertisement
Google Ads BL

పరువు హత్య కేసుపై హీరోలు రియాక్టయ్యారు


నేటి సమాజం సాంకేతికంగా ఎంతో ఎదుగుతూ ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం కుల, మత, ప్రాంతీయ దురభిమానాలు పెచ్చుమీరిపోతున్నాయి. నిరక్ష్యరాస్యతే దీనికి కారణమని కొందరు మేధావులు చెప్పారు. కానీ కులం కంపు వంటివి నిరక్ష్యరాస్యులలో కన్నా విద్యావంతులు, ఉన్నత పదవులు, ఉన్నత చదువులతో విదేశాలలో మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు, సోషల్‌ మీడియో వంటి వాటిని బాగా వాడుకుంటోన్న వారిలో కూడా ఈ బరితెగింపు ఉంది. ఇక విషయానికి వస్తే తాజాగా మిర్యాలగూడలోజరిగిన పరువు హత్య సంచలనం రేపింది. ప్రణయ్‌ అనే యువకుడిని తక్కువ కులం వాడు కావడం, తన కూతురిని వివాహం చేసుకోవడం వంటివి తట్టుకోలేని అమ్మాయి తండ్రి ప్రణయ్‌ని దారుణంగా హతమార్చాడు. దీనిపై మంచు మనోజ్‌ స్పందించాడు. మానవత్వం కంటే కులం, మతం ఎక్కువని నమ్మే వారి కోసమే ఈ లేఖ. కుల మతాలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరు ప్రణయ్‌ చావుకి కారకులే. సినీ హీరోలు, రాజకీయ పార్టీలు, కళాశాల యూనియన్లు, కుల, మత ఆర్గనైజేషన్స్‌... ఇలా ఏ నేపధ్యంలోనైనా సరే... కుల, మతాల ఘర్షణలు అత్యంత ఘోరం... దారుణమైనవి. 

Advertisement
CJ Advs

ఇతర విషయాలను గురించి తెలుసుకునే ముందు జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తండ్రిని చూసుకోకుండానే ఓ పసికందు తన తండ్రిని కోల్పోయింది. ఇంత కంటే దారణమైన ఘటన వారి జీవితాలల్లో ఇంకేం ఉంటుంది?ఇవ్వన్నీ కులం పేరుతో చేశారా? అసలు దానికి ఏమైనా విలువుందా? ఈ ప్రపంచంలో ఉన్న వారందకీ హృదయం ఒక్కటే. పీల్చే గాలి, దేహం ఒక్కటే. అలాంటప్పుడు కులం పేరుతో వేరే వారిని చంపడం ఎందుకు? అందరం ఒకటేనని ఈ ప్రపంచం ఎప్పుడు గమనిస్తుంది? కుల, మతాలకు మద్దతు పలికేవారు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రణయ్‌ని చంపిన వారే కాదు.. కులాలకు మద్దతు తెలిపే వారందరు దోషులే. కులాన్ని అంతం చేయండి.. అదొక అంటు రోగం. మనుషుల్లా ప్రవర్తించండి.....మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను. మన పిల్లలకు మెరుగైన సమాజాన్ని అందిద్దాం. ప్రణయ్‌ భార్య, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సారీ ప్రణయ్‌.. అంటూ మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశాడు. 

దీనిపై హీరో రామ్‌ స్పందిస్తూ.... ఒకపక్క సెక్షన్‌ 377ని కొట్టివేస్తూ మనుషులందరు ఒకటేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా ఈ కులాలు, పరువు హత్యలు ఏంటిరా? జంగిల్‌ ఫెలోస్‌. ముందు మనుషుల్లా ప్రవర్తించడం నేర్చుకోండి.. అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ప్రణయ్‌ స్థానంలో వారి కులస్తుడు ఉంటే తప్ప మరెవ్వరు ఉన్నా కూడా ఆమె తండ్రి ఇలాగే ప్రవర్తించేవాడు. ఇప్పుడు ప్రణయ్‌కి కూడా దళిత కార్డుని అడ్డుపెట్టి మరింతగా కులం రంగు పూస్తోన్న వారి పద్దతి సరికాదు. ముందుగా కులసంఘాలను రద్దు చేసినప్పుడు దీనికి కాస్త అడ్డుకట్ట వేయగలం....!

Manoj and Ram Reaction on Pranay Honor Killing:

Tollywood Heroes Responds on Pranay Murder
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs