Advertisement
Google Ads BL

మహేష్‌ హీరోయిన్‌కి ఇద్దరు కవల పిల్లలు


లీసారే.. జయంత్‌ సిపరాన్జీ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన భారీ కౌబోయ్‌ చిత్రం 'టక్కరిదొంగ'లో బాలీవుడ్‌ నటి లీసారే నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆడకపోవడం, ఆమె ముఖ కవళికలు తెలుగు వారికి దగ్గరగా లేకపోవడంతో ఆ తర్వాత ఆమెకి సరైన చాన్స్‌లు రాలేదు. ఇక వివాదాస్పదమైన దీపామెహతా చిత్రం 'వాటర్‌'లో నటించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈమె క్యాన్సర్‌ బారిన పడింది. జుట్టును కత్తిరించుకుని కీమో థెరపీ ఫొటోలను కూడా ఎంతో దైర్యంగా సోషల్‌ మీడియాలో పెడుతూ వచ్చేది. చివరకు తన ఆత్మ స్దైర్యంతో నిలబడిన ఆమె ముందు క్యాన్సర్‌ కూడా తలవంచక తప్పలేదు. 

Advertisement
CJ Advs

46 ఏళ్ల లిసారె 2012లో జేసన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జీవితంలో స్ధిరపడింది. అప్పటి నుంచి తల్లి కావాలని కలలు కంటున్న ఆమె తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. తన కోరికను నెరవేర్చుకుంది. సరోగసీ విధానం ద్వారా ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయింది. ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించింది. ఇద్దరు కవల ఆడపిల్లలకు తాను తల్లినయ్యానని ఆమె ఎంతో ఎమోషనల్‌గా సోషల్‌ మీడియాలో పెట్టిన మెసేజ్‌లు వైరల్‌ అవుతున్నాయి. తన పిల్లలతో తాను ఉన్న క్యూట్‌ ఫొటోని కూడా షేర్‌ చేసింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఈ సరోగసీ బాగా విస్తరిస్తోంది. 

షారుఖ్‌ఖాన్‌-గౌరీఖాన్‌ నుంచి మంచు లక్ష్మి వరకు ఇలా ఈ విధానం ద్వారా పలువురు పిల్లలు కన్నారు. కొందరు గర్బసంచిలో ఇబ్బందులు ఉండటం వల్ల ఈ పద్దతిని అనుసరిస్తూ ఉండగా, కొందరు గర్బాన్ని మోయడం బరువుగా భావించి ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. లిసారేకు గర్బధారణ విషయంలో సమస్యలు ఉన్న కారణంగానే ఈ పద్దతిని ఎంచుకుందని సమాచారం.

Mahesh Babu's yesteryear heroine Blessed with Twins:

Mahesh Babu actress welcomes Twin via Surrogacy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs